For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS: టీమిండియా కొంపముంచిన డ్రైవ్ లెంగ్త్.. కమిన్స్ ఉచ్చులో ఆరుగురు బ్యాటర్లు!

ఐదు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ సిరీస్ గమనాన్ని నిర్ణయించే కీలకమైన మూడో టెస్ట్‌లో టీమిండియా తడబడుతోంది. గత రెండు టెస్ట్‌ల తరహాలోనే పేలవ బ్యాటింగ్‌తో పాటు చెత్త బౌలింగ్‌తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్ బ్యాటర్లు భారీ స్కోర్ నమోదు చేసిన పిచ్‌పై భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. అనవసరమైన షాట్లతో మూల్యం చెల్లించుకున్నారు.

యశస్వి జైస్వాల్(4), శుభ్‌మన్ గిల్(1), విరాట్ కోహ్లీ(3), రిషభ్ పంత్(9), రోహిత్ శర్మ(10) తీవ్రంగా నిరాశపరిచారు. కేఎల్ రాహుల్(139 బంతుల్లో 8 ఫోర్లతో 84) ఒంటరి పోరాటం చేయగా.. స్మిత్ సింగిల్ హ్యాండ్ క్యాచ్‌తో శతకాన్ని చేజార్చుకున్నాడు. అయితే ఈ ఆరుగురు బ్యాటర్లు క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడం గమనార్హం. ఇందులో ముగ్గురు వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా.. మరో ఇద్దరూ స్లిప్‌ క్యాచ్‌గా వెనుదిరిగారు. యశస్వి జైస్వాల్ మాత్రమే షార్ట్ లెగ్‌లో క్యాచ్ ఇచ్చాడు.

IND vs AUS 6 Indian batters being caught out by length balls in Gabba Test

కమిన్స్ ఉచ్చులో పడిన భారత బ్యాటర్లు..
అయితే ఈ ఆరుగురు బ్యాటర్లు గుడ్ లెంగ్త్, డ్రైవ్ లెంగ్త్‌కే వెనురిదిరిగారు. భారత బ్యాటర్ల బలహీనతను పసిగట్టిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. అందుకు తగ్గట్లుగానే బంతులు వేయించి ఫలితాన్ని రాబట్టాడు. భారత బ్యాటర్ల ఫుట్ వర్క్, షాట్స్‌ను బాగా పరిశీలించి డ్రైవ్ లెంగ్త్ బంతులతో బోల్తా కొట్టించాడు. కవర్ డ్రైవ్స్ ఆడేలా ఊరించే బంతులతో ఉచ్చు బిగించాడు.

భారత ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు కమిన్స్.. తమ బౌలర్లు ఒకే ఒక్క విషయం చెప్పాడంట. బౌండరీలు కొట్టిన సరే కానీ.. డ్రైవ్ లెంగ్త్‌, గుడ్ లెంగ్త్‌లో బాల్స్‌ను పైకి వేయాలని సూచించాడట. షార్ట్ పిచ్ బాల్స్‌, స్టంప్ లైన్ బాల్స్ వేస్తూ మధ్య మధ్యలో డ్రైవ్ లెంగ్త్‌లో వేయాలని చెప్పాడట. కమిన్స్ సూచనలు పాటించిన ఆసీస్ బౌలర్లు భారత బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు.

అందరూ క్యాచ్ ఔటే..
యశస్వి జైస్వాల్ లెగ్ షాట్ ఆడే ప్రయత్నం చేసి మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇవ్వగా.. శుభ్‌మన్ గిల్ కవర్ డ్రైవ్ ఆడబోయి స్లిప్‌లో మూల్యం చెల్లించుకున్నాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని కవర్ డ్రైవ్ ఆడబోయి విరాట్ కోహ్లీ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. రిషభ్ పంత్ కూడా ఇదే తరహా బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ కూడా కవర్ డ్రైవ్ ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

నాలుగో రోజు ఆట ప్రారంభంలోనే 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ కూడా గుడ్ లెంగ్త్ బాల్‌కు స్లిప్ క్యాచ్ ఇచ్చాడు. కానీ ఈ క్యాచ్‌ను స్మిత్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన రాహుల్.. అద్భుతమైన పోరాటం చేశాడు. సెంచరీకి చేరువైన అతను నాథన్ లయన్ బౌలింగ్‌లో డ్రైవ్ లెంగ్త్‌లో పడినే బాల్‌కే స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. తెలుగు కామెంటేటర్ సుమన్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. భారత బ్యాటర్లంతా డ్రైవ్ లెంగ్త్‌లో పడిన బాల్స్‌కే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారని వివరించాడు.

వర్షం అంతరాయం..
ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 51.5 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(52 బ్యాటింగ్)తో పాటు నితీష్ కుమార్(9 బ్యాటింగ్) ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ను వర్షమే గట్టెక్కించాలి.

Story first published: Tuesday, December 17, 2024, 10:29 [IST]
Other articles published on Dec 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+