Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS నాలుగో టీ20కి వర్షం ముప్పు ఉందా?

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచిన భారత జట్టు మరో కీలక పోరుకు సిద్దమైంది. గురువారం గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగే నాలుగో టీ20లో ఆతిథ్య ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మూడో టీ20లో అద్వితీయమైన ప్రదర్శనతో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిందిన భారత్.. అదే జోరును నాలుగో టీ20లోనూ కొనసాగించాలనుకుంటుంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌పై పట్టు సాధించాలని ఆసీస్ భావిస్తోంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ సిరీస్‌లో కాన్‌బెర్రా వేదికగా జరిగిన తొలి టీ20 వర్షంతో రద్దయ్యింది. రెండు, మూడో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉందని వార్తలు వచ్చినా.. మ్యాచ్‌లు సజావుగానే సాగాయి. ఈ క్రమంలోనే నాలుగో టీ20కి ఆతిథ్యం ఇచ్చే గోల్డ్ కాస్ట్ వాతావరణం ఎలా ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

IND vs AUS 4th T20 Will Rain Disrupt the Gold Coast Clash

గోల్డ్ కోస్ట్ వాతావరణం ఎలా ఉందంటే..?

నాలుగో టీ20కి ఎలాంటి వర్షం ముప్పు లేదు. ఆక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం గురువారం గోల్డ్ కోస్ట్‌లో ఎలాంటి వర్షం లేదు. పూర్తిగా ఎండ కొట్టనుంది. మ్యాచ్ సమయంలో మాత్రం ఉష్ణోగ్రతలు 17 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోనున్నాయి.

గోల్డ్ కోస్ట్ పిచ్ రిపోర్ట్:

గోల్డ్ కోస్ట్‌లో బిల్ పిప్పెన్ ఓవల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బంతి మంచిగా బౌన్స్ అవుతుంది. ఈ పిచ్‌ ఆరంభంలో బౌలర్లకు కాస్త సహకరించినా.. మిడిల్ ఓవర్లలో మాత్రం ప్రతికూలంగా మారుతుంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే ఛాన్స్ ఉంది.

తుది జట్లు(అంచనా)

భారత్: శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే/నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ(కీపర్), అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్, టీమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినీస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, గ్జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమన్.

Story first published: Wednesday, November 5, 2025, 15:55 [IST]
Other articles published on Nov 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+