Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS 3rd Test: తొలి సెషన్‌ సమర్పయామి!

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. బ్రిస్బేన్‌లోని ఐకానిక్ గబ్బా స్టేడియం వేదికగా శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 5.3 ఓవర్ల పాటు ఆట జరగ్గానే వర్షం రావడంతో అంపైర్లు, ఆటగాళ్లు స్టేడియం నుంచి బయటకు పరుగెత్తారు.

1
60522

ఆ తర్వాత కాసేపటికే వర్షం ఆగిపోగా.. ఆట తిరిగి ప్రారంభమైంది. మరో 7.5 ఓవర్ల పాటు ఆట జరగ్గా వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో అంపైర్లు ముందుగానే లంచ్ బ్రేక్ ప్రకటించారు. దాంతో ఫస్ట్ సెషన్‌లో సగం ఆటను వరణుడు మింగేసాడు. వర్షంతో ఆట ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.

IND vs AUS 3rd Test Early Lunch Taken After Rain Strikes Again As Australia 28 0

ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(19 బ్యాటింగ్), నాథన్ మెక్‌స్వీనీ(4 బ్యాటింగ్) ఆచితూచి ఆడారు. జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ బంతులను చాకచక్యంగా ఎదుర్కొన్నారు. ఈ మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు బ్రిస్బేన్‌లో వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షంతో రద్దయినా.. ఫలితం తేలకుండా ముగిసినా.. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి.

మరోవైపు ఓవర్‌కాస్ట్ కండీషన్స్ నేపథ్యంలోనే బౌలింగ్‌ ఎంచుకున్నానని టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. కొంచెం ఓవర్‌కాస్ట్ కండిషన్స్‌ ఉండటంతో పాటు పిచ్‌పై గ్రాస్ కూడా ఉంది. ఈ కండిషన్స్‌ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే మేం చాలా క్రికెట్ ఆడాం. గత రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన చేశాయి. ఈ మ్యాచ్‌ మాకు చాలా కీలకం.

మాపై ఉన్న అంచనాలను అందుకోవాలనుకుంటున్నాం. మంచి క్రికెట్ ఆడుతాం. విజయవకాశాలను అందిపుచ్చుకోవాలి. గత మ్యాచ్‌లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. అందుకే ఓటమిపాలయ్యాం. ఈ మ్యాచ్ కోసం కుర్రాళ్లంతా సిద్దంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆడుదామా? అనే ఉత్సాహంతో ఉన్నారు.

మ్యాచ్ సాగుతున్నా కొద్దీ ఈ వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. తుది జట్టులో మేం రెండు మార్పులు చేశాం. అశ్విన్, హర్షిత్ రాణా స్థానాల్లో రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చారు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఈ మార్పులు చేశాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, జోష్ హజెల్ వుడ్

భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

Story first published: Saturday, December 14, 2024, 8:33 [IST]
Other articles published on Dec 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+