IND vs AUS: ఆసీస్ ఆశలు గల్లంతు..!
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. చివరి రోజు ఆటకు కూడా వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఓవర్‌నైట్ స్కోర్ 252/9తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 8 పరుగులను జోడించి 260 పరుగులకు ఆలౌటైంది.
ట్రావిస్ హెడ్ బౌలింగ్‌లో ఆకాశ్ దీప్(44 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31)ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. జస్‌ప్రీత్ బుమ్రా(10 నాటౌట్) అజేయంగా నిలిచాడు. దాంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 445 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.

భారత ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వెలుతురులేమి కారణంగా ఆట నిలిచిపోయింది. ఫ్లడ్‌లైట్లను ఆన్‌చేసేలోపే వర్షం రావడంతో అంతరాయం కలిగింది. గంటన్నరసేపు ఆటను మింగేసింది. దాంతో అంపైర్లు ముందుగానే లంచ్ బ్రేక్ ప్రకటించారు. 185 పరుగుల భారీ లక్ష్యం సొంతం చేసుకున్న ఆసీస్.. వేగంగా రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు చేసి భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచాలని భావించిన ఆసీస్‌పై వరణుడు నీళ్లు చల్లాడు.
ప్రస్తుతం మ్యాచ్ ప్రారంభమైనా.. మళ్లీ వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారత్ ముందు 300 పరుగుల లక్ష్యం నమోదు చేయాలనే పట్టుదలతో ఆసీస్ ఉంది. భారత బ్యాటర్లు కాస్త పట్టుదల కనబరిస్తే ఈ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకోవచ్చు. ఆసీస్ విజయవకాశాలను వర్షం దెబ్బతీసింది. ఫాలో ఆన్ గండం గట్టెక్కడంతోనే భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి గట్టెక్కినట్లు అయ్యింది. ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణ బ్యాటింగ్‌తో ఆఖరి వికెట్‌కు 47 పరుగులు జోడించి టీమిండియాకు ఓటమి తప్పించారు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 445 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ 260 ఆలౌట్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications