Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఆసీస్‌కు కలిసొచ్చిన రోహిత్ చెత్త కెప్టెన్సీ.. ఆ మూడు తప్పిదాలు చేయకుంటే?

 IND vs AUS 3rd Test, Day 2 Review: Rohit Sharmas captaincy blunders cost India

హైదరాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా దారుణంగా విఫలమైంది. తాము బిగించిన స్పిన్ ఉచ్చులోనే పడి గిలగిలలాడిన టీమిండియా ఓటమి ముంగిట నిలిచింది. వికెట్‌పై ఊహించని టర్న్‌తో తొలి రోజే బెంబేలెత్తిపోయిన భారత బ్యాటర్లు.. రెండో రోజు అదే వైఫల్యాన్ని కొనసాగించారు. మొదటి ఇన్నింగ్స్ వైఫల్యం నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోకుండా బరిలోకి దిగి మూల్యం చెల్లించుకున్నారు. చతేశ్వర్ పుజారా ఒక్కడే ఒంటరి పోరాటం చేయడంతో మ్యాచ్ మూడో రోజుకు దారి తీసింది. అతను కూడా తొలి ఇన్నింగ్స్ మాదిరి విఫలమై ఉంటే ఇప్పటికే మ్యాచ్ ఆసీస్ వశమయ్యేది.

అశ్విన్‌కు బౌలింగ్ ఇవ్వకుండా..

అశ్విన్‌కు బౌలింగ్ ఇవ్వకుండా..

రెండో రోజు తొలి సెషన్‌లో బౌలింగ్‌లో సత్తా చాటిన టీమిండియా.. బ్యాటింగ్‌లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయింది. గింగిరాలు తిరుగుతున్న పిచ్‌పై నిలబడలేకపోయింది. బ్యాటింగ్ వైఫల్యానికి తోడు కెప్టెన్‌గా రోహిత్ శర్మ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు టీమిండియా కొంపముంచాయి. రెండో రోజు ఆట ప్రారంభంలో రోహిత్.. రవిచంద్రన్ అశ్విన్‌కు ఆలస్యంగా బౌలింగ్ ఇచ్చి ఘోర తప్పిదం చేశాడు. తొలి రోజు ఆటలో నాలుగు వికెట్లు తీసిన జడేజాపైనే ఎక్కువ నమ్మకం ఉంచిన రోహిత్.. అశ్విన్‌ను మాత్రం పట్టించుకోలేదు. సిరాజ్, జడేజా, అక్షర్ పటేల్‌లతోనే బౌలింగ్ చేయించాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత తప్పని పరిస్థితుల్లో అశ్విన్‌కు బౌలింగ్ ఇవ్వగా అతను వికెట్ తీసి జట్టుకు సంతోషాన్నందించాడు.

 ముందే బౌలింగ్ ఇచ్చుంటే..

ముందే బౌలింగ్ ఇచ్చుంటే..

అదే జోరును కొనసాగిస్తూ వరుసగా వికెట్లు తీయగా.. మరోవైపు ఉమేశ్ యాదవ్‌ కూడా అండగా వికెట్లు తీయడంతో ఆసీస్ 11 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లు కోల్పోయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆసీస్ 30 పరుగులు అదనంగా చేసింది. అశ్విన్‌కే ముందు బౌలింగ్ ఇచ్చి ఉంటే ఆసీస్ 160లోపే ఆలౌటయ్యేది. అప్పుడు ఆధిక్యం తక్కువగా ఉండేది. ఇక బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా అదే తడబాటును కొనసాగించింది. లయన్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లోనూ రోహిత్ శర్మ.. వ్యూహాత్మకంగా తప్పిదం చేశాడు.

 అక్షర్ పటేల్‌ను ప్రమోట్ చేయకుండా..

అక్షర్ పటేల్‌ను ప్రమోట్ చేయకుండా..

ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌ల్లో అద్భుత బ్యాటింగ్‌తో విలువైన పరుగులు చేసిన అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌లో ప్రమోట్ చేయకుండా 8వ స్థానంలో పంపించి టీమ్‌మేనేజ్‌మెంట్ మూల్యం చెల్లించుకుంది. కేఎస్ భరత్ స్థానంలో బ్యాటింగ్ పంపించి ఉంటే ఒంటరి పోరాటం చేస్తున్న పుజారాకు అండగా నిలిచేవాడు. ఓ 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా టీమిండియా మెరుగైన స్థితిలో ఉండేది. కానీ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపించడం.. మరో ఎండ్‌లో బ్యాటర్లంతా ఔటవ్వడంతో అక్షర్ పటేల్ మరోసారి ఏం చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ అతను నాటౌట్‌గానే నిలిచాడు. నాగ్‌పూర్, ఢిల్లీ టెస్ట్‌ల్లో అక్షర్ ఆడిన కీలక ఇన్నింగ్స్‌లతోనే టీమిండియా విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో అతను నిస్సహాయంగా ఉండిపోవడంతో ఓటమి ముంగిట నిలిచింది.

పుజారాను గెలికి..

పుజారాను గెలికి..

ఇక బ్యాటర్లంతా విఫలమైన వేళ చతేశ్వర్ పుజారా తనశైలిలో నిదానంగా ఆడుతూ ఉంటే అనవసర స్ట్రాటజీతో రోహిత్ డిస్టర్బ్ చేశాడు. 'మేసే గాడిదను కూసే గాడిద వచ్చి చెడగొట్టినట్లు' ధాటిగా ఆడాలని ఇషాన్‌తో సందేశం పంపించి వారిని డిస్టర్బ్ చేశాడు. అటాకింగ్ గేమ్ ఆడాలని రోహిత్ చెప్పడంతో అప్పటి వరకు నిదానంగా ఆడిన పుజారా.. తన శైలికి భిన్నంగా భారీ సిక్సర్ కొట్టాడు. కానీ ఆ వెంటనే లయన్ బౌలింగ్‌లో స్మిత్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. పుజారా ఔటైన కొద్దిసేపటికే టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. వారి స్ట్రాటజీ ప్రకారం వారిని ఆడనిస్తే టీమిండియాకు 100 పరుగుల ఆధిక్యమైనా లభించేది.

Story first published: Thursday, March 2, 2023, 18:46 [IST]
Other articles published on Mar 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+