Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: టీమిండియా కొంపముంచిన రోహిత్ చెత్త కెప్టెన్సీ.. ఆ రెండు తప్పిదాలు చేయకుంటే..!

 IND vs AUS 3rd Test, Day 1 Review: Rohit Sharma and Ravindra Jadejas mistake cost India

హైదరాబాద్: 'ఎవడు తవ్వుకున్న గొయ్యిలో వాడే పడ్డట్లు'ఉంది టీమిండియా పరిస్థితి. సొంతగడ్డపై జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్పిన్ మంత్రం జపిస్తున్న టీమిండియా.. అనుకూలమైన టర్నింగ్ ట్రాక్స్‌తో తొలి రెండు టెస్ట్‌ల్లో భారీ విజయాలు నమోదు చేసింది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని రిటైన్ చేసుకుంది. ఇదే జోరులో ఇండోర్ వేదికగా బుధవారం ప్రారంభమైన మూడో టెస్ట్‌ బరిలోకి దిగిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. స్పిన్ వికెట్ ప్లాన్ బెడిసి కొట్టింది. ఇండోర్ వికెట్‌ను అంచనా వేయడంలో విఫలమైన టీమిండియా మేనేజ్‌మెంట్ భారీ మూల్యం చెల్లించుకుంది.

 పిచ్‌ను అంచనా వేయలేక..

పిచ్‌ను అంచనా వేయలేక..

పిచ్ క్యురేటర్ చెప్పిన మాటలో...? లేక వికెట్‌పై గడ్డిని చూసి బ్యాటింగ్ అనుకూలిస్తుందనే అంచనానో? తెలియదు కానీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. బొక్కబోర్లాపడింది. తొలి రోజు తొలి గంటలోనే బంతి నాలుగు డిగ్రీలు మేర తిరగడంతో భారత బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సైతం క్రీజులో నిలబడలేకపోయారు. విరాట్ కోహ్లీ కాస్త పోరాడినా.. ఎక్కువ సేపు ఉండలేకపోయాడు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే పెవిలియన్‌కు క్యూ కట్టారు.

ఒక్క బ్యాటర్..

ఒక్క బ్యాటర్..

గత రెండు మ్యాచ్‌ల్లో లోయర్ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేసిన జడేజా, అశ్విన్, అక్షర్.. ఈ సారి మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయారు. తెలుగు తేజం కేఎస్ భరత్ ఓ భారీ సిక్సర్‌తో ఆశలు రేకెత్తించినా.. చివర్లో ఉమేశ్ యాదవ్ రెండు భారీ సిక్సర్లు బాదినా టీమిండియాను గట్టెక్కించలేకపోయాయి. చివరకు పేలవమైన రీతిలో 109 పరుగులకు టీమిండియా కుప్పకూలింది. కోహ్లీ మినహా ఒక్క ప్లేయర్ కనీసం 50 బంతులు ఆడలేకపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు పిచ్ ఎంత కఠినంగా ఉందో.

ఘోర తప్పిదాలతో..

ఘోర తప్పిదాలతో..

భారత బ్యాటింగ్ చూసి నిరాశకు గురైన అభిమానులు.. బౌలింగ్‌లో ఆసీస్‌కు చుక్కలు చూపిస్తారని ఆశపడ్డారు. కానీ ఆరంభంలోనే ఘోర తప్పిదాలతో ఆసీస్‌కు అవకాశాలు కల్పించారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను జడేజా త్వరగా ఔట్ చేసినా.. మరో ఓపెనర్ ఖవాజాను అడ్డుకోలేకపోయారు. అతని కోసం ఏకంగా మూడు రివ్యూలు వృథా చేశారు. ట్రావిస్ హెడ్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్‌ను జడేజా స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసినా.. అది కాస్త నోబాల్ కావడం భారత్‌కు నష్టం చేసింది. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో లబుషేన్ ఎల్బీ కాగా.. రోహిత్ రివ్యూ తీసుకోకుండా తప్పు చేశాడు. రిప్లేలో ఔటని తేలడంతో లబుషేన్ ఊపిరి పీల్చుకోగా.. రోహిత్ నెత్తిని బాదుకున్నాడు. ఆ తర్వాత ఉన్న రివ్యూలను వృథా చేసుకున్న భారత్.. బౌలింగ్‌లో సత్తా చాటలేకపోయింది.

ఆ రెండు అవకాశాలు ఇవ్వకుంటే..

ఆ రెండు అవకాశాలు ఇవ్వకుంటే..

భారత్ ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న లబుషేన్.. ఖవాజాతో కలిసి తొలి వికెట్‌‌కు 96 పరుగులు జోడించాడు. లబుషేన్‌ను, హాఫ్ సెంచరీ బాదిన ఖవాజాను జడేజా ఔట్ చేసినా.. స్మిత్ పిచ్‌కు తగ్గట్లు బ్యాటింగ్ చేసి విలువైన పరుగులు జోడించాడు. జడేజా ఒక్కడే నాలుగు వికెట్లు తీయగా.. మరో బౌలర్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. స్పిన్‌కు అనుకూలమైన వికెట్‌పై పేసర్లు ఫీల్డింగ్‌కే పరిమితమవ్వగా.. అశ్విన్ అసౌకర్యంగా బౌలింగ్ చేశాడు. అక్షర్ బౌలింగ్‌లో తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. అయితే మార్నస్ లబుషేన్‌కు ఇచ్చిన రెండు లైఫ్స్‌ను టీమిండియా సద్వినియోగం చేసుకొని ఉండి ఉంటే మరిన్ని వికెట్లు తీసుకొని ఇంకా మెరుగైన స్థితిలో నిలిచేది. ఏది ఏమైనా తొలి రోజు ఆటలో ఆసీస్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. కెప్టెన్‌గా బ్యాటర్‌గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు.

Story first published: Wednesday, March 1, 2023, 18:30 [IST]
Other articles published on Mar 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+