Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS 3rd T20I: వరల్డ్ రికార్డ్‌పై కన్నేసిన టీమిండియా!

IND vs AUS 3rd T20I: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. నేడు(మంగళవారం) గువాహతి వేదికగా జరగనున్న మూడో టీ20లో ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది.

అటు బ్యాటర్స్, ఇటు బౌలర్స్ ఆధిపత్యం కొనసాగిస్తుండటంతో టీమిండియా ఈ సిరీజ్ విజయం పెద్ద కష్టమేమీ కాదు. గత రెండు మ్యాచ్‌ల్లో 200 ప్లస్ రన్స్ చేసిన టీమిండియా.. అదే మజాను ప్రేక్షకులకు అందించేందుకు సిద్దమైంది.

IND vs AUS 3rd T20I: India eye record win against struggling Australia

మరోవైపు తొలి రెండు టీ20ల్లో ఎదురైన అనూహ్య పరాజయాల నుంచి తేరుకోవాలని ఆసీస్ భావిస్తోంది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.

ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను వరల్డ్ రికార్డ్ ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే టీ20 ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా చరిత్రకెక్కనుంది. ఇప్పటికే టీ20ల్లో 135 విజయాలు సాధించిన టీమిండియా.. 136వ విజయంపై కన్నేసింది. నేడు జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా ఓడిస్తే.. పాకిస్థాన్ రికార్డును సూర్య సేన అధిగమించనుంది.

ప్రస్తుతం పాకిస్థాన్ కూడా 135 విజయాలతో భారత్‌తో సమంగా ఉంది. ఇప్పటి వరకు 211 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 135 విజయాలు సాధించి 66 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇందులో 6 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. పాకిస్థాన్ 226 మ్యాచ్‌ల్లో 135 మ్యాచ్‌ల్లో విజయం సాధించి 82 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.
భారత్, పాకిస్థాన్ తర్వాత ఈ జాబితాలో న్యూజిలాండ్(200 మ్యాచ్‌ల్లో 102 విజయాలు), సౌతాఫ్రికా (171 మ్యాచ్‌ల్లో 95), ఆస్ట్రేలియా( 179 మ్యాచ్‌ల్లో 94), ఇంగ్లండ్( 177 మ్యాచ్‌ల్లో 92) కొనసాగుతున్నాయి.

IND vs AUS 3rd T20I: India eye record win against struggling Australia

ముఖా ముఖి పోరు..
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 28 మ్యాచ్‌లు జరగ్గా.. టీమిండియా 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆసీస్ 10 విజయాలు సాధించగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

గువాహతి పిచ్ రిపోర్ట్:
బర్సాపరా వికెట్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే గతంలో ఇక్కడే ఆస్ట్రేలియా చేతిలో ఓడిన చేదు అనుభవం భారత్‌కు ఉంది. కానీ పటిష్టమైన సౌతాఫ్రికాపై భారీ స్కోర్ చేసి గెలిచింది. ప్రస్తుత టీమిండియా ఫామ్‌ను చూస్తే మరో పరుగుల విందు గ్యారంటీ. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.

Story first published: Tuesday, November 28, 2023, 10:06 [IST]
Other articles published on Nov 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+