Ind vs Aus, 3rd T20: కోహ్లీసేన హిస్టరీ రిపీట్ చేస్తుందా? ఆసీస్ క్లీన్ స్వీప్ తప్పించుకుంటుందా? తుది జట్లు ఇవే!

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో మొదలుపెట్టిన భారత జట్టు నేలకు కొట్టిన బంతిలా పుంజుకొని వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలి రెండు వన్డేలు ఓడి సిరీస్ చేజార్చుకున్న కోహ్లీసేన.. ఆఖరి వన్డేలో అదిరే ఆటతో విజయాల బాట పట్టింది. మూడు టీ20ల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకొని రీవేంజ్ తీర్చుకుంది. అదే ఉత్సాహంతో సిడ్నీ వేదికగా మంగళవారం జరగనున్న ఆఖరి పోరుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి వైట్‌వాష్ తప్పించుకోవాలని ఆసీస్ ప్రయత్నిస్తోంది. దాంతో ఈ మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగి అభిమానులకు కావాల్సిన మజానివ్వనుంది.
2016 ఆసీస్ పర్యటనలోనూ భారత్ భారత్ తొలుత వన్డే సిరీస్‌ను కోల్పోయింది. కానీ ఆ తర్వాత జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ సారి కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేయాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంది. ఆటగాళ్లందరు లయను అందుకోవడం, ఆసీస్‌ను గాయల బెడద వేధించడం భారత జట్టుకు సానుకూలంశం. పైగా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడం..ఆల్‌రౌండర్ జడేజా గాయంతో జట్టుకు దూరమైనా సిరీస్ గెలవడం కోహ్లీసేనకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. మరీ అదే జోరులో ఆసీస్‌ను మట్టికరిపిస్తుందో లేదో చూడాలి!

రోహిత్ లేకున్నా..
రోహిత్, జడేజా గైర్హాజరీలోనూ టీమిండియా బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్ఠంగా ఉంది. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్‌లో ఉండటం, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతుండటం భారత్‌కు కలిసొస్తుంది. సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ భారీ షాట్లు స్కోరు వేగానికి దోహదపడుతున్నాయి. కానీ ఈ ఇద్దరూ మార్క్ పెర్ఫామెన్స్ కనబర్చాల్సిన అవసరం ఉంది. మనీష్ పాండే గాయం కారణంగా శ్రేయస్ ఆఖరి మ్యాచ్‌లోనూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండో టీ20లో విజయాన్ని నిర్ణయించింది మిడిల్ ఓవర్లే. ఆసీస్ ఇన్నింగ్స్ మిడిల్‌ఓవర్లలో నెమ్మదిగా సాగగా, కోహ్లీ ముచ్చటైన షాట్లతో రన్‌రేటును నియంత్రణలో ఉంచాడు. రేపటి మ్యాచ్‌లోనూ భారత బ్యాట్స్‌మెన్ ఇదే జోరును కొనసాగిస్తే ఆసీస్‌కు కష్టాలు తప్పవు.

నట్టూ రాకతో..
బౌలింగ్‌లో స్టార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ లేకున్నా పేసర్లు దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్ గొప్పగా రాణిస్తున్నారు. ఈ ముగ్గురు ఆడిన మ్యాచ్‌లు మొత్తంగా 30 కూడా లేవు. అయినా పేస్‌దళం బాధ్యతల్ని గొప్పగా నిర్వర్తిస్తున్నారు. యువ పేసర్ నటరాజన్ బౌలింగ్ అయతే సంచలనం.
అతని బౌలింగ్‌ను ఆసీస్ బ్యాట్స్‌మెన్ అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. యార్కర్లతోనే జట్టులోకి వచ్చిన నట్టూ ఇప్పుడూ బౌన్సర్లు, ఆఫ్ కట్టర్లతోనూ ప్రత్యర్థిని వణికిస్తున్నాడు. రెండో టీ20లో నటరాజన్ కట్డడిచేసిన పరుగులే భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాయి. అతడితో పాటు శార్దూల్ ఠాకూర్ నకుల్ బంతులతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తన పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఆరో బౌలర్ లేకపోవడం భారత్‌కు ఇబ్బంది పెడుతోంది. చాహల్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ మరో బౌలర్ లేక అతనితోనే కోహ్లీ నాలుగు ఓవర్లు వేయించాడు.

ఆఖరి టీ20లో ఫించ్?
ఆసీస్‌ను గాయాల బెడద వేధిస్తోంది. డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, కమిన్స్ జట్టులో లేకపోవడం ఆసీస్‌కు ప్రతికూలాంశంగా మారింది. అయితే కెప్టెన్ ఆరోన్ ఫించ్ చివరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మాథ్యూ వేడ్ దూకుడుగా ఆడటం ఆ జట్టుకు కాస్త ఊరట కలిగిస్తుంది. స్మిత్‌తో పాటు మాక్స్‌వెల్, స్టోయినిస్ జట్టు బాధ్యతలను అందుకుంటే భారత్ జోరును అడ్డుకోవచ్చు. అయితే మూడో టీ20లోనూ ఓటమిపాలైనా కంగారూలకు టెస్టు సిరీస్‌పై ఎక్కువ ప్రభావం చూపించకపోవచ్చు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడే ఆటగాళ్లు పొట్టిఫార్మాట్ సిరీస్‌లో ఎక్కువ మంది లేకపోవడం ఆ జట్టుకు ప్లస్ పాయింట్.

తుదిజట్లు (అంచనా)
భారత్: శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకుర్, దీపక్ చాహర్, నటరాజన్, యుజ్వేంద్ర చాహల్
ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్, ఆరోన్ ఫించ్/డీఆర్సీ షార్ట్, స్టీవ్ స్మిత్, స్టాయినిస్, మాక్స్‌వెల్, హెన్రిక్స్, అబాట్, డేనియల్, స్వెప్సన్, జంపా, ఆండ్రూ టై
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications