Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ గెలవాలంటే ఏం చేయాలంటే..?

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా శుభారంభం అందుకోలేకపోయింది. ఆస్ట్రేలియా అరంగేట్ర ప్లేయర్ సామ్ కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఆ జట్టు‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది.

టీమిండియా బౌలర్లను చెడుగుడు ఆడిన సామ్ కోన్‌స్టాస్ తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించాడు. దాంతో తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. కీలక భాగస్వామ్యాలను నమోదు చేయడంతో తొలి రోజు ఆటలో ఆసీస్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

IND vs AUS 3 things India need to do right to dominate on Day 2 in 4th Test at MCG

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగుల భారీ స్కోర్ చేసింది. సామ్ కోన్‌స్టాస్‌తో పాటు టాప్-4 బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), మార్నస్ లబుషేన్(145 బంతుల్లో 7 ఫోర్లతో 72), స్టీవ్ స్మిత్(111 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 68 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా .. ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌పై టీమిండియా పట్టు బిగించాలన్నా.. విజయం సాధించాలన్నా రెండో రోజు ఆటలో మూడు పనులు చేయాలి.

1. ఆకాశ్‌దీప్‌కు కొత్త బంతి..
యువ పేసర్ ఆకాశ్ దీప్‌‌‌ను కొత్త బంతితో ఎక్కువగా బౌలింగ్ చేయించాలి. కొత్త బంతితో స్వింగ్ రాబడుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం ఆకాశ్ దీప్ స్పెషాలిటీ. తొలి రోజు ఆటలో రోహిత్ శర్మ.. అతనికి కొత్త బంతి ఇవ్వకుండా ఘోర తప్పిదం చేశాడు. అతనికి బదులుగా సిరాజ్‌కు బంతినివ్వవగా.. అతను వికెట్లు తీయలేకపోయాడు. రెండో కొత్త బంతిని అందుకున్న ఆకాశ్ దీప్ నిలకడగా ఆడుతున్న అలెక్స్ క్యారీని పెవిలియన్ చేర్చాడు. రెండో రోజు ఆట ఆరంభంలోనూ ఓవైపు ఆకాశ్ దీప్.. మరోవైపు బుమ్రాతో ఎక్కువ సేపు బౌలింగ్ చేయించాలి.

2. స్మిత్‌ను త్వరగా ఔట్ చేయాలి..
68 పరుగులతో క్రీజులో ఉన్న స్టీవ్ స్మిత్‌ను భారత బౌలర్లు వీలైనంత త్వరగా ఔట్ చేయాలి. స్మిత్ సెంచరీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కాబట్టి అతన్ని వీలైనంత త్వరగా ఔట్ చేయాలి. రెండో రోజు ఆరంభంలోనే పెవిలియన్ చేర్చాలి. స్మిత్ కుదురుకుంటే మాత్రం ఆసీస్‌కు భారీ స్కోర్ అందిస్తాడు. అతన్ని త్వరగా ఔట్ చేస్తేనే ఆసీస్ 350-375 స్కోర్‌కు పరిమితమవుతోంది. ఒకవేళ స్మిత్ సెంచరీ చేస్తే మాత్రం 400 పరుగుల భారీ స్కోర్ చేస్తోంది. అప్పుడు టీమిండియాకు విజయవకాశాలు దక్కుతాయి.

3. జాగ్రత్తగా ఆడాలి..
భారత బ్యాటర్లు తమ ఇన్నింగ్స్‌ను జాగ్రత్తగా ప్రారంభించాలి. ముఖ్యంగా షాట్ సెలెక్షన్ విషయంలో ఎమరపాటుతో ఉండాలి. నిర్లక్ష్యపు షాట్స్ ఆడితే ఘోర పరాభావం ఎదురవుతోంది. ముఖ్యంగా ఓపెనర్లు ఓపికగా బ్యాటింగ్ చేసి శుభారంభం అందించాలి. తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో లబుషేన్, ఖవాజా ఔటైన తీరును భారత బ్యాటర్లు పరిశీలించాలి. ఆసీస్ తరహాలోనే భారత టాపార్డర్ చెలరేగితేనే ఈ మ్యాచ్ విన్నింగ్ రేసులో టీమిండియా నిలుస్తోంది.

Story first published: Thursday, December 26, 2024, 17:48 [IST]
Other articles published on Dec 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+