For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS: ఆ మూడు తప్పిదాలే టీమిండియా కొంపముంచాయి!

IND vs AUS: 3 mistakes by Team India in the 3rd ODI vs Australia

హైదరాబాద్: నాలుగేళ్ల తర్వాత టీమిండియా సొంతగడ్డపై వన్డే సిరీస్ కోల్పోయింది. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన మూడో వన్డేలో సమష్టిగా విఫలమైన టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓ దశలో పటిష్టంగా కనిపించిన టీమిండియా.. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమికి తల వంచింది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూపర్ కెప్టెన్సీ ముందు టీమిండియా బ్యాటర్లు నిలవలేకపోయారు. ముఖ్యంగా మూడు తప్పిదాలు ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి కారణమయ్యాయి. ముందుగా బౌలింగ్‌లో పట్టు విడిచి.. అనంతరం బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన రోహిత్‌ సేన సిరీస్‌ను ఆసీస్‌కు చేజేతులా సమర్పించుకుంది.

 డెత్ బౌలింగ్ వైఫల్యం..

డెత్ బౌలింగ్ వైఫల్యం..

టీమిండియా డెత్ బౌలింగ్ వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. 203/7 నిలిచిన ఆసీస్.. ఓ దశలో 220 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ కానీ తోకను కత్తిరించడంలోని బలహీనతను మరోసారి బయటపెట్టుకున్న భారత్‌.. ఆస్ట్రేలియాను 269 స్కోరు చేయనిచ్చి వారికి గెలిచే ఉత్సాహాన్ని అందించింది. ఆసీస్ టెయిలెండర్స్ చేసిన 49 పరుగులే భారత పతనాన్ని శాసించాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. టెయిలెండర్స్ రాణించకుంటే జట్టుకు పోరాడే లక్ష్యం దక్కేది కాదని, ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకొచ్చాడు. 220 పరుగుల్లోపే ఆసీస్‌ను కట్టడి చేసుంటే టీమిండియా బ్యాటర్లు స్వేచ్చగా ఆడటానికి ఆస్కారం ఉండేది.

బెడిసికొట్టిన ప్రయోగం..

బెడిసికొట్టిన ప్రయోగం..

ఈ మ్యాచ్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన రెండు ప్రయోగాలు బెడిసికొట్టాయి. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో ఆసీస్ స్పిన్నర్లను ఎదుర్కొవాలని టీమిండియా రచించిన వ్యూహం ఫలించలేదు. అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేస్తూ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించగా.. అతను రనౌటయ్యాడు. ఇక చివరి 20 ఓవర్లు సమర్థవంతంగా ఎదుర్కొంటాడని సూర్యకుమార్ యాదవ్‌ను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే అతను మరోసారి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ రెండు ప్రయోగాలు బెడిసికొట్టడంతో టీమిండియా బ్యాటర్లు ఒత్తిడికి లోనయ్యారు.

 నిర్లక్ష్యపు షాట్లతో..

నిర్లక్ష్యపు షాట్లతో..

చెన్నై పిచ్ కండిషన్స్‌‌కు తగ్గట్లు టీమిండియా బ్యాటర్లు ఆడలేకపోయారు. అనవసర షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. ఆడమ్ జంపా, అష్టన్ అగర్‌లు వికెట్ టేకింగ్ బౌలర్లనే విషయం మరిచి వారి బౌలింగ్‌లో భారీ షాట్లకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నారు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. అగర్ బౌలింగ్‌లో కోహ్లీ ఇలానే ఔటయ్యాడు. అంతకుముందు రోహిత్ శర్మ పుల్ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఆడమ్ జంపా మూడో పవర్ ప్లేలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను ఔట్ చేసి విజయానికి బాటలు వేసాడు. ఈ ఇద్దరూ కూడా అనవసరపు షాట్లతో మూల్యం చెల్లించుకున్నారు. కడవరకు ఆడాలని ఏ ఒక్క బ్యాటర్ అనుకోలేదు. ఇదే టీమిండియా ఓటమికి కారణమైంది.

Story first published: Thursday, March 23, 2023, 14:38 [IST]
Other articles published on Mar 23, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+