Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: తిలక్ వర్మ కళ్లు చెదిరే క్యాచ్.. బిత్తరపోయిన ట్రావిస్ హెడ్! (వీడియో)

టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో టీ20లో సూపర్ ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. బౌండరీ లైన్‌పై గాల్లోకి ఎగిరి బంతిని అందుకోవడంతో పాటు అద్భుతంగా సమన్వయం చేసుకున్నాడు. తిలక్ వర్మ సూపర్ క్యాచ్‌కు ఆసీస్ డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(28) నిరాశగా పెవిలియన్ చేర్చాడు.

వరుణ్ చక్రవర్తీ వేసిన ఐదో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని ట్రావిస్ హెడ్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ బౌండరీ లైన్‌పై అద్భుతంగా గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. ఈ క్రమంలో సమన్వయం కోల్పోయిన తిలక్ బంతిని గాల్లోకి ఎగిరేసి మళ్లీ వచ్చి అందుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

IND vs AUS 2nd T20I Tilak Varma s Stunning Boundary-Line Catch Dismisses Travis Head
Photo Credit: X (twitter)

ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. హర్షిత్ రాణా(33 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35) అతనికి అండగా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇందులో ముగ్గురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవలేదు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/13) మూడు వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు తీసారు. మార్కస్ స్టోయినీస్ ఒక వికెట్ తీసాడు. పరిస్థితులను గౌరవించకుండా దూకుడుగా ఆడి భారత బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు.

అనంతరం ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ మిచెల్ మార్ష్(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. ట్రావిస్ హెడ్(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/26), వరుణ్ చక్రవర్తీ(2/23), కుల్దీప్ యాదవ్(2/43) రెండేసి వికెట్లు తీసారు. పవర్ ప్లేలో కాస్త కట్టడిగా బౌలింగ్ చేసినా.. బ్యాటింగ్‌లో మరో 20 పరుగులు చేసినా ఫలితం మరోలా ఉండేది.

Story first published: Friday, October 31, 2025, 16:47 [IST]
Other articles published on Oct 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+