IND vs AUS: పాపం రుతురాజ్ గైక్వాడ్.. 6 ఏళ్ల తర్వాత డైమండ్ డక్! (వీడియో)
IND vs AUS, 1st T20: టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో డైమండ్ డక్‌గా వెనుదిరిగిన మూడో భారత బ్యాటర్‌గా చెత్త రికార్డ్‌ను మూటగట్టుకున్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో వైజాగ్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో ఒక్క బంతి కూడా ఆడకుండానే రనౌట్‌గా వెనుదిరిగిన రుతురాజ్ ఈ అప్రతిష్టను తన పేరిట లిఖించుకున్నాడు.
టీ20ల్లో డైమండ్ డకౌట్ అయిన భారత బ్యాటర్ల జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రా, అమిత్ మిశ్రా.. రుతురాజ్ గైక్వాడ్ కన్నా ముందున్నారు. 2016లో జస్‌ప్రీత్ బుమ్రా ఒక్క బంతి కూడా ఆడకుండానే ఔటవ్వగా.. 2017లో అమిత్ మిశ్రా డైమండ్ డక్ అయ్యాడు. 6 ఏళ్ల తర్వాత తాజాగా రుతురాజ్ గైక్వాడ్ ఈ చెత్త ఫీట్‌ను సాధించాడు. యశస్వీ జైస్వాల్ కారణంగా రుతురాజ్ గైక్వాడ్ రనౌట్‌గా వెనుదిరిగాడు.

209 పరుగుల భారీ లక్ష్యంతో భారత్ తమ ఇన్నింగ్స్ ప్రారంభించగా.. మార్కస్ స్టోయినీస్ వేసిన తొలి ఓవర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతికి జైస్వాల్.. ఫైన్ లెగ్ దిశగా ఆడి క్విక్ డబుల్ తీసే ప్రయత్నం చేశాడు. రెండో పరుగు కోసం గైక్వాడ్‌ను పిలిచి హాఫ్ పిచ్ ధాటిన తర్వాత యూటర్న్ తీసుకున్నాడు.
దాంతో గైక్వాడ్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. యశస్వీ తప్పిదం కారణంగా గైక్వాడ్ బలయ్యాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. పాపం గైక్వాడ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లీస్(50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 110) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్(41 బంతుల్లో 8 ఫోర్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సూపర్ బ్యాటింగ్‌తో నిలకడగా ఆడుతోంది. ఈ ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడుతుండటంతో టీమిండియా 9 ఓవర్లలోనే 98 పరుగులు పూర్తి చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications