Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేకేఆర్ వదిలేస్తే అతని కోసం 9 జట్లు పోటీ పడుతాయి: ఆశిష్ నెహ్రా

IND vs AUS 1st T20: టీమిండియా యువ ఫినిషర్ రింకూ సింగ్‌పై టీమిండియా దిగ్గజ పేసర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ప్రశంసల జల్లు కురిపించాడు. అసాధారణ బ్యాటింగ్‌తో ఆటలో అత్యున్నత స్థాయికి చేరాడని కొనియాడాడు. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం వైజాగ్ వేదికగా ఉత్కంఠగా సాగిన తొలి మ్యాచ్‌లో రింకూ సింగ్ ఆఖరి బంతికి సిక్స్ బాది సంచలన విజయాన్ని అందించాడు.

నోబాల్ కావడంతో ఈ సిక్స్ పరిగణలోకి రాకపోయినా.. అతను మ్యాచ్ ముగించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ ఇన్నింగ్స్ నేపథ్యంలోనే రింకూ సింగ్‌ను కేకేఆర్ వదిలేస్తే మిగతా 9 జట్లు తీవ్రంగా పోటీపడుతాయని ఆశీష్ నెహ్రా తెలిపాడు. ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోసినిమాతో మాట్లాడిన రింకూ సింగ్‌ను కామెంట్రీ ప్యానెల్ తమ జోకులతో ఆట పట్టించింది.

IND vs AUS 1st T20: Ashish Nehra says ‘Other 9 Teams will not leave Rinku Singh in the IPL Auction’

జియోసినిమా కామెంట్రీ ప్యానెల్‌లో ఉన్న కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్.. టీమిండియా ఫినిషర్‌గా ఎదిగేందుకు రింకూ సింగ్ పడ్డ కష్టాన్ని వివరించాడు. 'ఇది రింకూ సింగ్ పడ్డ 5-6 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.'అని తెలిపాడు. వెంటనే రింకూ సింగ్ మాట్లాడుతూ..'కేకేఆర్‌కు ఆడటం మొదలుపెట్టినప్పుడు నేను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. 2018లో నాకు తొలి అవకాశం దక్కినా.. నేను ఏంటో నిరూపించుకోలేకపోయాను. కానీ కేకేఆర్ ఫ్రాంచైజీ నాకు అండగా నిలిచింది. నాపై నమ్మకం ఉంచింది. అభిషేక్ నాయర్ సార్‌తో కలిసి నేను చాలా కష్టపడ్డాను.'అని తెలిపాడు.

కామెంట్రీ ప్యానెల్‌లో ఉన్న అనంత్ త్యాగీ... 'రింకూ సింగ్ జాగ్రత్త.. ఈ ప్యానెల్‌లో లక్నోసూపర్ జెయింట్స్, గుజరాత్ జెయింట్స్ స్కౌట్స్ కూడా ఉన్నారు.'అని జోక్ చేశాడు.

వెంటేనే ఆశిష్ నెహ్రా.. అతనికి ఏ స్కౌట్‌తో పనిలేదని, కేకేఆర్ వదిలేస్తే మిగతా 9 ఫ్రాంచైజీలు మినీ వేలంలో గద్దల్లా కొట్టుకుంటాయని తెలిపాడు. 'ప్రస్తుతం అతనికి స్కౌట్స్‌తో పనిలేదు. అతను ఇప్పటికే గొప్ప స్థాయికి చేరుకున్నాడు. కేకేఆర్ ఎట్టి పరిస్థితుల్లో రింకూ సింగ్‌ను వదులుకోదు. కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది. నేను కూడా అదే కోరుకుంటున్నా. ఒకవేళ అతన్ని వదిలేస్తే మాత్రం ఐపీఎల్ వేలంలో మిగతా 9 జట్లు తీవ్రంగా పోటీపడుతాయి. 'అని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.

ఇక తన ఇన్నింగ్స్‌పై సంతోషం వ్యక్తం చేసిన రింకూ సింగ్.. మ్యాచ్ ముగిస్తాననే నమ్మకంతోనే బ్యాటింగ్‌కు వచ్చానని తెలిపాడు. నెంబర్ 6లో తాను తరుచుగా ఆడుతానని చెప్పిన రింకూ సింగ్.. గతేడాది ఐపీఎల్‌లో కూడా ఇదే స్తానంలో బ్యాటింగ్ చేశానన్నాడు.

Story first published: Friday, November 24, 2023, 16:39 [IST]
Other articles published on Nov 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+