IND vs AFG వన్డే సిరీస్.. కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్
తొడ కండరాల గాయంతో అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో యశస్వి జైస్వాల్‌ను భారత సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరి దేవజిత్ సైకియా శనివారం వెల్లడించారు. హార్దిక్ పాండ్యా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడని, రోహిత్ శర్మ కూడా రిపోర్ట్ చేస్తాడని తెలిపారు.
శ్రీలంక పర్యటనలో మల్టీడే మ్యాచ్‌లు ఆడే భారత్-ఏ జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు ధ్రువ్ జురెల్‌ను సారథిగా ఎంపిక చేసింది. దేవదత్ పడిక్కల్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా చోటు దక్కింది.

ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత్.. జూన్ 13 నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. ధర్మశాల వేదికగా తొలి వన్డే జరగనుండగా.. జూన్ 17న లక్నో వేదికగా రెండో వన్డే.. జూన్ 20న చెన్నై వేదికగా మూడో వన్డే జరగనుంది.
అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు(అప్‌డేటేడ్):
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్.
భారత్-ఏ జట్టు:
ధ్రువ్ జురెల్(కెప్టెన్), హర్ష్ దూబే, అన్షుల్ కాంబోజ్, సాయి సుదర్శన్, సరాన్ష్ జైన్, జగదీశన్, ఆయుష్ పాండే, గుర్నూర్ బ్రార్, అమన్ మోఖడే, దేవదత్ పడిక్కల్(వైస్ కెప్టెన్), ఆకిబ్ నబీ, షేక్ రషీద్, రుతురాజ్ గైక్వాడ్, యశ్ ఠాకూర్, జీషన్ అన్సారీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications