Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Manav Suthar: కొడుకు ఆట చూడకుండానే స్టేడియం వీడిన తండ్రి.. ఎందుకంటే?

టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ దుమ్మురేపాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్వితీయమైన ప్రదర్శన కనబర్చాడు. ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మానవ్ సుతార్.. తొలి ఇన్నింగ్స్‌లోనే (6/33) 6 వికెట్లు పడగొట్టాడు. తద్వారా అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ఘనత అందుకున్న 10వ భారత బౌలర్‌గా మానవ్ సుతార్ చరిత్రకెక్కాడు.

అయితే ఈ అద్వితీయమైన ప్రదర్శనను చూడకుండానే మానవ్ సుతార్ తండ్రి జగదీష్ మైదానం వీడారు. తొలి రోజు ఆటకు మానవ్ సుతార్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అతని తండ్రితో పాటు తల్లి, సోదరి ఈ మ్యాచ్‌కు వచ్చారు. మానవ్ సుతార్ అరంగేట్ర టెస్ట్ క్యాప్ అందుకునే సమయంలో వారు చాలా భావోద్వేగానికి గురయ్యారు. అయితే రెండో రోజు ఆటలో తమ కొడుకు ఆటను చూసే ధైర్యం లేకనే మైదనం వీడామని జగదీష్ మీడియాకు తెలిపారు.

సూర్యకుమార్ యాదవ్‌పై ముంబై ఇండియన్స్ వేటు..?

సూర్యకుమార్ యాదవ్‌పై ముంబై ఇండియన్స్ వేటు..?

చాలా భయమైంది..

రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన జగదీష్ రిటైర్డ్ పీఈటీ. తన కొడుకు ప్రదర్శనను చూసేందుకు చాలా నర్వస్‌గా ఫీలయ్యామని జగదీష్ తెలిపారు. 'నా భార్య, కూతురు మానసీ కూడా మ్యాచ్ చూడటానికి వచ్చారు. మానవ్ సుతార్ క్యాప్ అందుకున్న క్షణం వర్ణించలేం. ఇది మానవ్ సుతార్ కష్టానికి దక్కిన ఫలితం.

చిన్నప్పటి నుంచి మానవ్ సుతార్ ఎంతో కష్టపడ్డాడు. ప్రాక్టీస్ కోసం ఉదయమే ఇంటిని వీడేవాడు. మళ్లీ సాయంత్రానికే వచ్చేవాడు. మానవ్ సుతార్ సక్సెస్‌లో అతని చిన్ననాటి కోచ్ ధీరజ్ శర్మ కృషి కూడా ఎంతో ఉంది.’అని జగదీష్ చెప్పుకొచ్చారు.

అఫ్గాన్‌ను శాసించిన మానవ్ సుతార్..

మానవ్ సుతార్(6/140) సిక్సర్‌తో అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు కుప్పకూలింది. రెహ్మత్ షా(135 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 60) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్‌కు తోడుగా ప్రసిధ్ కృష్ణ(3/37) మూడు వికెట్లతో సత్తా చాటాడు. వాషింగ్టన్ సుందర్(1/21) ఒక వికెట్ దక్కింది. భారత్‌కు 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 127 ఓవర్లలో 564/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. శుభ్‌మన్ గిల్(177 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 126), కేఎల్ రాహుల్(165 బంతుల్లో 11 ఫోర్లతో 100) సెంచరీలతో చెలరేగగా.. రిషభ్ పంత్(121 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81), వాషింగ్టన్ సుందర్(68 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. మానవ్ సుతార్ సైతం బ్యాటింగ్‌లో కీలకమైన 28 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్స్‌లు ఉన్నాయి.

IND vs AFG: మానవ్ సుతార్ 'సిక్సర్’.. అఫ్గాన్ బేజార్!

IND vs AFG: మానవ్ సుతార్ 'సిక్సర్’.. అఫ్గాన్ బేజార్!
Story first published: Monday, June 8, 2026, 14:04 [IST]
Other articles published on Jun 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+