Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: రవీంద్ర జడేజా చెత్త షాట్.. సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ! (వీడియో)

టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా స్టార్ ఆల్‌‌రౌండర్ రవీంద్ర జడేజా వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ జడేజా బ్యాట్ ఎత్తేసాడు. అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్‌లో జడేజా దారుణంగా విఫలమయ్యాడు. 5 బంతుల్లో ఓ బౌండరీ సాయంతో 7 పరుగులే చేసి చెత్త షాట్‌తో పెవిలియన్ చేరాడు.

జడేజా వైఫల్యం కంటే అతను ఔటైన తీరే అందర్నీ తీవ్రంగా నిరాశ పరిచింది. జడేజా అనవసర షాట్‌తో ఔటవ్వడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహనం కోల్పోయారు. కోపంతో బండ బూతులు తిట్టారు. ఈ షాట్ అవసరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. జడేజా ఔటైన తర్వాత కోహ్లీ, రోహిత్‌ రియాక్షన్ టీవీ కెమెరాల్లో కనిపించింది.

IND vs AFG Virat Kohli Rohit Sharma s Reaction Goes Viral After Ravindra Jadeja s Dismissal

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌కు హాజరైన ఫ్యాన్స్ సైతం జడేజా పేలవ షాట్ చూసి అవాక్కయ్యారు. కీలక సమయంలో బాధ్యతాయుతంగా ఆడాల్సిన జడేజా.. నిర్లక్ష్యపు షాట్‌తో పెవిలియన్ చేరడాన్ని అభిమానులు, కోహ్లీ, రోహిత్ జీర్ణించుకోలేకపోయారు. ఫజలక్ ఫరూకీ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ నాలుగో బంతిని ఫజలక్ ఫరూకీ స్లోయర్ బౌన్సర్‌గా చాలా ఎత్తులో వేయగా.. జడేజా వెంటాడి మరి షాట్ ఆడాడు. ఆ బంతిని జడేజా వదిలేసి ఉంటే వైడ్ అయ్యేది. కానీ జడేజా థర్డ్ మ్యాన్‌ అవతల పడేద్దామని ప్రయత్నించగా.. మిస్ టైమ్ అయిన బంతి షార్ట్ థర్డ్ ఫీల్డర్‌ చేతిలోకి దూసుకెళ్లింది. కీలక సమయంలో చెత్త షాట్‌తో జడేజా వెనుదిరగడంతో కోహ్లీ, రోహిత్ ఆగ్రహానికి గురయ్యారు.

సీఎస్‌కే జెర్సీ ధరించిన ఓ అభిమాని కూడా జడేజా ఔటైన తీరు చూసి ఆశ్చర్యపోయాడు. కావాలనే వికెట్ పారేసుకున్నాడా? అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32)దూకుడుగా ఆడాడు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(8), రిషభ్ పంత్(24), విరాట్ కోహ్లీ(20) తీవ్రంగా నిరాశపరిచారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ(3/33), రషీద్ ఖాన్(3/26) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు. నవీన్ ఉల్ హక్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Thursday, June 20, 2024, 22:26 [IST]
Other articles published on Jun 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+