Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన నవీన్ ఉల్ హక్!(వీడియో)

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ట్రేడ్ మార్క్ సిక్సర్‌తో అలరించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో బౌలర్‌ తలపై నుంచి కళ్లు చెదిరే సిక్సర్ బాదాడు. ప్రస్తుతం ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

నవీన్ ఉల్ హక్ వేసిన 5వ ఓవర్‌లో కోహ్లీ ఈ సూపర్ సిక్సర్ బాదాడు. ఈ ఓవర్ నాలుగో బంతిని నవీన్ ఉల్ హక్ షార్ట్ ఆఫ్ లెంగ్త్‌లో వేయగా.. విరాట్ కోహ్లీ బౌలర్ తలపై నుంచి సిక్సర్‌‌గా తరలించాడు. ఈ సిక్సర్ గత టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్ బౌలర్ హ్యారీస్ రౌఫ్ బౌలింగ్‌‌లో కొట్టిన అద్భుత సిక్సర్‌ను తలపించింది.

IND vs AFG Virat Kohli Hits Spectacular Six Off Naveen-ul-Haq in their super-8 clash in T20 WC 2024

కోహ్లీ సూపర్ సిక్స్‌కు నవీన్ ఉల్ హక్ కూడా ఫిదా అయ్యాడు. ఇలా కూడా సిక్స్ కొడుతారా? అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన ఏకైక బౌండరీ ఇదే కావడం విశేషం.

ఆరంభంలోనే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోవడంతో కోహ్లీ ఆచితూచి ఆడాడు. బంతికో పరుగు తీసిన కోహ్లీ.. నవీన్ ఉల్ హక్‌ బౌలింగ్‌లోనే సిక్సర్ బాది గేర్ మార్చాడు. కానీ ఆ కొద్ది సేపటికే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 24 బంతుల్లో సిక్సర్ సాయంతో 24 పరుగులే చేశాడు.

ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటాడ. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది.

హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) రాణించగా.. రోహిత్ శర్మ(8), రిషభ్ పంత్(24), విరాట్ కోహ్లీ(20) తీవ్రంగా నిరాశపరిచారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ(3/33), రషీద్ ఖాన్(3/26) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు. నవీన్ ఉల్ హక్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Thursday, June 20, 2024, 21:21 [IST]
Other articles published on Jun 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+