Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: సిగ్గుండాలి కోహ్లీ.. దేశం కంటే కూతురు ఎక్కువ?

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూతురి బర్త్ డే కోసం అంతర్జాతీయ మ్యాచ్‌కు దూరంగా ఉండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దేశం కంటే కూతురు ఎక్కువ? అని నిలదీస్తున్నారు. అఫ్గానిస్థాన్ మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్‌కు వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ దూరమయ్యాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. బెంగళూరు వేదికగా జరిగే రెండో టీ20కి ముందు జట్టుతో కలుస్తాడని చెప్పాడు. జనవరి 11( గురువారం) విరాట్ కోహ్లీ ముద్దుల తనయ వామికా పుట్టిన రోజు. ఆమె జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడని అర్థమవుతోంది. వామికా పుట్టిన రోజు వేడుకలు విదేశాల్లో నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 IND vs AFG: Virat Kohli brutally trolled after He To Miss 1st T20I vs Afghanistan

కూతురి బర్త్ డే కోసం విరాట్ కోహ్లీ అఫ్గాన్‌తో తొలి టీ20కి దూరంగా ఉండటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ అంతర్జాతీయ క్రికెటర్ అయిన కోహ్లీకి ఇది ఏ మాత్రం తగదని మండిపడుతున్నారు. దేశం కంటే కుటుంబమే ఎక్కువైనప్పుడు.. టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని హితవు పలుకుతున్నారు.

ఈ వ్యవహారంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులు రెండుగా విడిపోయి విమర్శలు గుప్పిస్తున్నారు. నేషనల్ డ్యూటీని పక్కనపెట్టి కూతురు బర్త్ డే వేడుకల్లో పాల్గొంటున్న కోహ్లీపై రోహిత్ శర్మ అభిమానులు విమర్శలు గుప్పిస్తుండగా.. విరాట్ ఫ్యాన్స్ తిప్పికొడుతున్నారు. ప్రతీ ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుందని, కుటుంబమే తొలి ప్రాధాన్యతగా ఉంటుందని బదులు ఇస్తున్నారు.

గతంలో రోహిత్ శర్మ కూడా తన కూతురు బర్త్ డే కోసం వన్డే మ్యాచ్‌కు దూరమయ్యాడని గుర్తు చేస్తున్నారు. ఈ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీకి ఎవరూ సాటి రారని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. జీవా పుట్టిన సమయంలో ధోనీ ఆస్ట్రేలియాలో వన్డే ప్రపంచకప్ 2015 ఆడుతున్నాడని, టోర్నీ ముగిసిన తర్వాతనే తన కూతుర్ని చూశాడని గుర్తు చేస్తున్నారు.

దేశం కోసం ఆడటంలో ధోనీ తర్వాతే కోహ్లీ, రోహిత్ ఉంటారని కామెంట్ చేస్తున్నారు. ఇక కూతురి కోసం విరాట్ కోహ్లీ మ్యాచ్‌లకు దూరంగా ఉండటం ఇదే తొలిసారి కాదు. ఆమె పుట్టినప్పుడు ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే ఇండియాకు వచ్చేసాడు. కీలక సిరీస్‌లో అజింక్యా రహానే భారత జట్టును విజేతగా నిలబెట్టాడు.

Story first published: Wednesday, January 10, 2024, 20:41 [IST]
Other articles published on Jan 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+