అతనే మా నెంబర్ 3 బ్యాటర్: గౌతమ్ గంభీర్
అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్‌లో సాయి సుదర్శన్ నెంబర్ 3లో ఆడుతాడని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇప్పటి వరకు అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదని చెప్పాడు. అంతేకాకుండా ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడని గుర్తు చేశాడు.
న్యూ చండీగఢ్ వేదికగా శనివారం నుంచి అఫ్గానిస్థాన్, భారత్ మధ్య ఏకైక టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం టీమిండియా సన్నాహకాలను పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శుక్రవారం గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. టీమ్ కాంబినేషన్ గురించి ప్రశ్నించగా.. సాయి సుదర్శన్ నెంబర్ 3లో ఆడుతాడని స్పష్టం చేశాడు. తద్వారా దేవదత్ పడిక్కల్ బెంచ్‌కే పరిమితమవుతాడనే విషయాన్ని వెల్లడించాడు.

'సాయి సుదర్శన్‌కు ఇప్పటి వరకు తగిన అవకాశాలు రాలేదు. అతను ఇంగ్లండ్ పర్యటనలో కూడా ఆడాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అతనికి వరుస అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం. మేం 11 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయగలం. సాయి సుదర్శన్ ఏం చెత్త ఫామ్‌లో లేడు. ఐపీఎల్‌లో 700 పరుగులు చేశాడు. 4-5 మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా సాయి సుదర్శన్‌ను జడ్జ్ చేస్తే.. మేం జట్టును నిర్మించలేం.
డబ్ల్యూటీసీ టైటిల్ గెలుస్తామనే నమ్మకం మాకుంది. జట్టులో ప్రతిభకు కొదవలేదు. ఆటగాళ్లంతా డబ్ల్యూటీసీ గెలవాలనే కసితో ఉన్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టెస్ట్ మ్యాచ్ జరుగుతుందని సాకులు చెప్పడానికి లేదు.
టెస్ట్ మ్యాచ్‌లు అనేవి మెంటల్ టఫ్‌నెస్‌ను పరీక్షిస్తాయి. ఆగస్టులో వెళ్లే శ్రీలంక పర్యటన కోసం నలుగురు స్పిన్నర్లను సిద్దం చేస్తున్నాం.'అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కూడా టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌కు ఎంపికైన భారత జట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్‌దూబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications