Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: అది రోహిత్ శర్మ బలహీనత కాదు: సునీల్ గవాస్కర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరుపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు.

కేవలం 8 పరుగులే చేసి చెత్త షాట్‌తో పెవిలియన్ చేరాడు. తొలి ఓవర్‌ నుంచే అసౌకర్యంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ.. ఆఫ్ సైడ్ పడిన బంతిని లెగ్ సైడ్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇలా పదే పదే రాంగ్ షాట్స్‌తో ఔటవ్వడంపై రోహిత్ శర్మను పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.

IND vs AFG Sunil Gavaskar defends Rohit Sharma over left-arm pace struggles

అయితే సునీల్ గవాస్కర్ మాత్రం రోహిత్ శర్మను వెనుకేసుకొచ్చాడు. 'రోహిత్ శర్మ ఎంతో అనుభవం కలిగిన బ్యాటర్. ఎలా ఆడాలనేది అతనికి తెలుసు. రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిని మార్చుకోవాలని చెప్పడం సరికాదు. ఏ బ్యాటర్ అయినా బౌలర్‌ను బట్టి ఆడుతారు. కొన్నిసార్లు దూకుడుగా వెళ్లినా వికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది.

ఆఫ్‌సైడ్ వేసిన బంతి లెగ్ సైడ్ ఆడుతున్నాడంటే కారణం ఉండొచ్చు. రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. ఏదొక సమయంలో బ్యాటర్ ఔట్ కావాల్సిందే. అలాగని ఆఫ్‌స్టంప్ బయట వేసిన బంతిని ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరితే దానికి బలహీనతగా భావించనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగులు చేసి.. 30 లేదా 40 సార్లు ఆఫ్‌స్టంప్ బంతులను ఆడుతూ ఔటైనా సరే ఆందోళన అవసరం లేదు.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

లెఫ్టార్మ్ పేసర్‌ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో 19 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ శర్మ 8 సార్లు లెఫ్టార్మ్ పేసర్లకే ఔటయ్యాడు. మొత్తం 98 బంతులు ఎదుర్కొని 128 పరుగులే చేశాడు.

Story first published: Friday, June 21, 2024, 18:21 [IST]
Other articles published on Jun 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+