Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: అఫ్గాన్‌పై భారత్ ఘన విజయం!

అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ధర్మశాల వేదికగా శనివారం జరిగిన తొలి వన్డే సమష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌‌ను అంపైర్లు 25 ఓవర్లకు కుదించారు.

IND vs AFG: శుభ్‌మన్ గిల్ ఘోర తప్పిదం.. అర్ష్‌దీప్ సింగ్ అసహనం!

IND vs AFG: శుభ్‌మన్ గిల్ ఘోర తప్పిదం.. అర్ష్‌దీప్ సింగ్ అసహనం!

శతక్కొట్టిన గుర్బాజ్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రెహ్మానుల్లా గుర్బాజ్(51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102) శతకంతో చెలరేగగా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ(27), అజ్మతుల్లా ఒమర్జాయ్(26) డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌ స్కోర్‌కే పరిమితమయ్యారు.

IND vs AFG Shubman Gill Unbeaten 84 Guides India to Dominant 7-Wicket Win Over Afghanistan in 1st ODI

భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్(3/27), హర్ష్ దూబే(3/47) మూడేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి(2/31) రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 84 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34), కేఎల్ రాహుల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అఫ్గాన్ బౌలర్లలో జియూర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

10 శాతం కమీషన్ దొబ్బుతూనే ఐపీఎల్‌పై విమర్శలా?: సునీల్ గవాస్కర్ ఫైర్!

10 శాతం కమీషన్ దొబ్బుతూనే ఐపీఎల్‌పై విమర్శలా?: సునీల్ గవాస్కర్ ఫైర్!

రోహిత్ విఫలమైనా..

195 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ(16) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో ఇషాన్ కిషన్‌తో కలిసి శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 70 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని రషీద్ ఖాన్ విడదీసాడు. ఇషాన్ కిషన్(34)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు రాగా.. శుభ్‌మన్ గిల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అయ్యర్‌(12)ను జియూర్ రెహ్మాన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. కేఎల్ రాహుల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 నాటౌట్)తో కలిసి గిల్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగనుంది.

Story first published: Saturday, June 13, 2026, 22:24 [IST]
Other articles published on Jun 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+