Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే నితీష్ కుమార్ రెడ్డి ఆడటం లేదు: శుభ్‌మన్ గిల్

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఇక భారత జట్టులో అనూహ్యంగా మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డితో పాటు హర్ష్ దూబే, ప్రసిధ్ కృష్ణ దూరం కాగా.. యశస్వి జైస్వాల్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు.

తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతుండటంతోనే ఈ మ్యాచ్‌కు నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో లేకుండా పోయాడని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. టాస్ సందర్భంగా మాట్లాడిన గిల్.. నితీష్ రెడ్డి గైర్హాజరీతో కాంబినేషన్‌ను మార్చాల్సి వచ్చిందన్నాడు. ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్‌ తుది జట్టులోకి వచ్చాడని, ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేస్తున్నాడని చెప్పాడు.

నితీష్ వల్లే మార్పులు..

'టాస్ గెలిస్తే మా కాంబినేషన్‌కు తగ్గట్లుగా ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. ఈ మ్యాచ్‌లో మేం కేవలం ఐదుగురు బౌలర్లతోనే ఆడుతున్నాం. అందుకే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. క్లిష్ట పరిస్థితుల్లో ఆడుతూ అనుభవాన్ని పొందేందుకే ఈ మ్యాచ్‌లను ఉపయోగించుకుంటాం. ఛేజింగ్ చేయాల్సి వస్తే.. భారీ స్కోర్లను ఛేదించడం అలవాటు చేసుకోవాలి.

Shubman Gill Reveals Quad Issue Forced Nitish Kumar Reddy Out of 2nd ODI vs Afghanistan

అదే డిఫెండ్ చేయాల్సి వస్తే తక్కువ స్కోర్లను కాపాడుకోవాలి. అందుకు బౌలింగ్‌లో రాణించడం చాలా ముఖ్యం. మా జట్టులో మూడు మార్పులు చేశాం. ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేస్తున్నాడు. తొడ కండరాల నొప్పితో నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తీసుకొచ్చాం.'అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

IND vs SL: శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ కొట్లాట!(వీడియో)

IND vs SL: శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ కొట్లాట!(వీడియో)

మూడు మార్పులతో అఫ్గాన్..

మరోవైపు టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ.. బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చాలా తాజాగా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో మేం బాగా ఆడాం. కానీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం. అందువల్లే విజయాన్ని అందుకోలేకపోయాం.

మాకు ఒక మంచి భాగస్వామ్యం లభించింది, కానీ ఆ తర్వాత మా వికెట్లను కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం. ఆ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని ఈ మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్దమయ్యాం. మా జట్టులో మూడు మార్పులు ఉన్నాయి. నబీకి ఆరోగ్యం బాగోలేదు. అతను అనారోగ్యంతో ఉన్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో అజ్మత్ గాయపడ్డాడు. అలాగే జియా షరీఫీ కూడా ఆడటం లేదు. బిలాల్ (సామి) దర్విష్ రసూలి అరంగేట్రం చేస్తున్నారు'అని హష్మతుల్లా తెలిపాడు.

తుది జట్లు:

అఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), దర్విష్ రసూలి, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటి, ఏఎమ్ గజన్‌ఫర్, మహ్మద్ సలీమ్ సఫీ, బిలాల్ సామి.

ఇండియా: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కె.ఎల్. రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.

మళ్లీ వివాదంలో వైభవ్ సూర్యవంశీ.. అంపైరింగ్‌పై దుమారం!

మళ్లీ వివాదంలో వైభవ్ సూర్యవంశీ.. అంపైరింగ్‌పై దుమారం!
Story first published: Wednesday, June 17, 2026, 14:03 [IST]
Other articles published on Jun 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+