Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: ఎముకల కొరికే చలిలో మ్యాచ్.. వెచ్చదనం కోసం ఆటగాళ్ల‌ తిప్పలు! (వీడియో)

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్‌ తొలి టీ20 మ్యాచ్‌లో ఎముకల కొరికే చలి ఆటగాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసింది. మొహాలీ ఆతిథ్యం ఇచ్చిన ఈ మ్యాచ్‌లో చ‌లి ఆటగాళ్లకు సవాల్‌గా మారింది. ఫీల్డింగ్, బౌలింగ్ చేసేందుకు ఆటగాళ్లు తెగ ఇబ్బంది పడ్డారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే చలిని తట్టుకోలేక వేడి నీళ్లు తెప్పించుకొని ఉపశమనం పొందాడు. తీవ్ర చలిలో బంతిని ఆపేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. మైదానాన్ని పూర్తిగా పొగ మంచు కప్పేసింది.

https://telugu.oneindia.com/entertainment/hanuman-movie-premiere-show-review-370941.html?story=2

ఈ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు స్వెటర్స్, దుప్పట్లతో ఆటను వీక్షించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఆటగాళ్లు సైతం స్వెటర్స్, కుళ్లలతో కనిపించారు. ఆటగాళ్లు చలికి ఇబ్బంది పడుతున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చలి కారణంగా బౌలర్లకు బంతిపై పట్టు చిక్కకున్నా.. భారత బౌలర్లు అద్భుతంగానే బౌలింగ్ చేశారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహమ్మద్ నబీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), అజ్మతుల్లా ఒమర్జాయ్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29), ఇబ్రహీమ్ జడ్రాన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా.. 28 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్‌తో సమన్వయలోపంతో రోహిత్ శర్మ(0) సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. శుభ్‌మన్ గిల్ తప్పిదం కారణంగా రనౌటయ్యాడు. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. టీ20ల్లో అత్యధిక సార్లు రనౌటైన భారత బ్యాటర్‌గా ధోనీ, కోహ్లీ సరసన నిలిచాడు.

మెరుపులు మెరిపించిన తిలక్ వర్మ(23) ఔటవ్వగా.. శివమ్ దూబే(26 నాటౌట్), జితేశ్ శర్మ(6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి 60 బంతుల్లో 76 పరుగులు చేయాలి.

Story first published: Thursday, January 11, 2024, 21:45 [IST]
Other articles published on Jan 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+