Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే సంజూ శాంసన్‌తో పాటు ఆ ముగ్గుర్ని పక్కన పెట్టాం: రోహిత్ శర్మ

IND vs AFG: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం వెనుక ప్రత్యేకమైన కారణం ఏం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. పిచ్ చూడటానికి బాగుందని చెప్పిన రోహిత్.. పెద్దగా మారే అవకాశం లేదన్నాడు.

టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్‌లను పక్కనపెట్టామని తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఇందుకు కచ్చితమైన కారణం ఏం లేదు. పిచ్ బాగుంది. పెద్దగా మారే అవకాశం లేదు. టీ20 ప్రపంచకప్ 2024 ముందు మేం ఆడుతున్న ఏకైక టీ20 సిరీస్ ఇదే.

IND vs AFG: Rohit Sharma reveals the reason Why Sanju Samson, Yashasvi Jaiswal not playing in 1st T20I

మెగా టోర్నీ ముందు ఐపీఎల్ మాత్రమే ఆడనున్నాం. ఈ మూడు మ్యాచ్‌లను మా టీమ్ కాంబినేషన్‌ ఎంపికకు వాడుకుంటాం. కాంబినేషన్ గురించి ఇప్పటికే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో చర్చించాను. జట్టుకు కావాల్సిన కాంబినేషన్‌ను ఎంపిక చేసేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకుంటాం. అలాగే ఈ సిరీస్ గెలవడం కూడా మాకు ముఖ్యమే.టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశం ఇవ్వలేదు.'అని రోహిత్ శర్మ తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని అఫ్గానిస్థాన్ కెప్టెన్ ఇబ్రహీం జడ్రాన్ అన్నాడు. అయితే ముందుగా బ్యాటింగ్ చేయడం పెద్ద సమస్య కాదన్నాడు. 'మా ప్రణాళికలను సమర్థవంతంగా అములు చేసే ప్రయత్నం చేస్తాం. టీ20 ప్రపంచకప్ ముందు అనుభవం కలిగిన జట్టుతో సిరీస్ ఆడటం గొప్ప అవకాశం. సానుకూల క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. నూర్ అహ్మద్, షరఫుద్దిన్, సలీమ్ సైఫీ ఈ మ్యాచ్ ఆడటం లేదు.'అని ఇబ్రహీం జడ్రాన్ చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ నిర్ణయంతో ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని భావించిన యశస్వి జైస్వాల్‌కు మొండి చెయ్యే ఎదురైంది. కుల్దీప్ యాదవ్ కంటే రవి బిష్ణోయ్‌కే తొలి ప్రాధాన్యత దక్కింది.

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేశ్ శర్మ(కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్

అఫ్గానిస్థాన్: రెహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీమ్ జడ్రాన్, రెహ్‌మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజిబుల్లా జడ్రాన్, మహమ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, కరీమ్ జనత్, ఫజలక్ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్

Story first published: Thursday, January 11, 2024, 19:03 [IST]
Other articles published on Jan 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+