Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: ఓయ్ అంపైర్.. రెండు సార్లు డకౌటయ్యా! రోహిత్ శర్మ ఫన్నీ కామెంట్స్(వీడియో)

భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టీ20లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అంపైర్ వీరేందర్ శర్మ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. అంపైర్‌ను ఉద్దేశించి రోహిత్ శర్మ అన్న వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఫరీద్ అహ్మద్ మాలీక్ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతి రోహిత్ శర్మ బ్యాట్‌ను తాకి బౌండరీకి వెళ్లింది. అయితే అంపైర్ వీరేందర్ శర్మ లెగ్‌బై‌స్‌గా ప్రకటించాడు. దాంతో రోహిత్ శర్మ తనదైన శైలిలో అంపైర్‌ను నిలదీసాడు.

'హే వీరు.. నువ్వు తొలి బంతిని థై ప్యాడ్‌కు తగిలిందని లెగ్‌బైస్‌గా ప్రకటించవా? అది బ్యాట్‌ను తాకిందయ్యా. నేను ఇప్పటికే రెండు సార్లు డకౌటయ్యాను సామీ.'అని నవ్వుతూ అన్నాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. అంపైర్ కూడా నవ్వుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు.

IND vs AFG: Rohit Sharma Hilarious Conversation With Umpire Virender Sharma during 3rd T20I goes Viral

ఇక ఫరీద్ అహ్మద్ వేసిన మూడో ఓవర్‌లోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. వరుస బంతుల్లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటయ్యారు. జైస్వాల్(4) భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔటవ్వగా.. మరుసటి బంతికే కోహ్లీ క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(1)ను అజ్మతుల్లా ఒమర్జాయ్ ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే సంజూ శాంసన్‌(0)ను ఫరీద్ అహ్మద్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్‌తో రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడపిస్తున్నాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 4 వికెట్లకు 30 పరుగులే చేసింది. తొలి రెండు టీ20ల్లో బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్.. రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా అటాకింగ్ గేమ్ ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు.

యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీతో పాటు శివమ్ దూబే, సంజూ శాంసన్‌లు కూడా దూకుడుగా ఆడే క్రమంలోనే వికెట్ పారేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా అటాకింగ్ ప్లాన్ మిస్‌ఫైర్ అయ్యిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Story first published: Wednesday, January 17, 2024, 19:47 [IST]
Other articles published on Jan 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+