Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: రోహిత్ శర్మ చెత్త రికార్డ్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట చెత్త రికార్డ్ లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20‌ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా హిట్ మ్యాక్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో రోహిత్ శర్మ(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20లోనూ రోహిత్ శర్మ డకౌటయ్యాడు. దాంతో టీ20ల్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ 12 సార్లు డకౌటయ్యాడు.

టీ20ల్లో అత్యధికసార్లు డకౌటైన జాబితాలో రోహిత్ శర్మ తర్వాత జింబాబ్వే క్రికెటర్ రెగిస్ చకబ్వా, సౌమ్య సర్కార్(బంగ్లాదేశ్), ఉమర్ అక్మల్(పాకిస్థాన్), తిలకరత్నే దిల్షాన్(శ్రీలంక), డసన్ షనక(శ్రీలంక) ఉన్నారు. రెగిస్ చకబ్వా, సౌమ్య సర్కార్ 11 సార్లు డకౌటవ్వగా.. ఉమ్రాన్ అక్మల్, దిల్షాన్, డసన్ షనక 10 సార్లు డకౌటయ్యారు.

 IND vs AFG: Rohit Sharma creates unwanted record with golden duck in second T20I vs Afghanistan

ఇక రోహిత్ శర్మకు ఇది 150వ అంతర్జాతీయ టీ20 కాగా.. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా హిట్ మ్యాన్ చరిత్రకెక్కాడు. 2007లో భారత్ తరపున అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన హిట్ మ్యాన్ తాజా మ్యాచ్‌తో 150 టీ20 మ్యాచ్‌ల మైలు రాయిని అందుకున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లలో రోహిత్ శర్మ తర్వాత ఐర్లాండ్ ప్లేయర్ స్టిర్లింగ్ ఉన్నాడు. ఇప్పటి వరకు స్టిర్లింగ్ 134 మ్యాచ్‌లు ఆడాడు. మరో ఐర్లాండ్ ప్లేయర్ డాకర్లెల్ (128), పాకిస్థాన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ (124), న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ (122) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ఇబ్రహీమ్ జడ్రాన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/32) తీన్మార్ బౌలింగ్‌తో రఫ్ఫాడించగా.. రవి బిష్ణోయ్(2/39), అక్షర్ పటేల్(2/17) రెండేసి వికెట్లతో అఫ్గానిస్థాన్ పతనాన్ని శాసించారు. శివమ్ దూబేకు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా దూబే, యశస్వి సిక్సర్ల మోతకు ఓవర్లలో 4 వికెట్లకు పరుగులు చేసి అలవోక విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ(16 బంతుల్లో 5 ఫోర్లతో 29), రింకూ సింగ్(9 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.

Story first published: Sunday, January 14, 2024, 22:23 [IST]
Other articles published on Jan 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+