For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AFG: ఒకే ఓవర్‌లో 36 పరుగులు.. వర్త్ శర్మా వర్త్! (వీడియో)

భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్‌ మూడో టీ20లో పరుగుల వరద పారింది. బెంగళూరు వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, రింకూ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో సిక్సర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా చివరి ఓవర్‌లో ఈ ఇద్దరూ పోటాపడి సిక్స్‌లు బాదడంతో అఫ్గానిస్థాన్ బౌలర్ కరీమ్ జనత్ చెత్త రికార్డు నమోదు చేశాడు.

ఈ ఇద్దరి విధ్వంసంతో చివరి ఓవర్‌లో 36 పరుగుల సమర్పించుకున్నాడు. ఈ ఓవర్‌లో రోహిత్ శర్మ తొలి మూడు బంతుల్లో ఓ ఫోర్, రెండు సిక్స్‌లు బాదగా.. రింకూ సింగ్ చివరి మూడు బంతుల్లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. కరీమ్ జనత్ ఒక నోబాల్ వేయడంతో టీమిండియా ఖాతాలో 36 పరుగులు చేరాయి.

IND vs AFG: Rinku Singh and Rohit Sharma equal record for most runs off a single over in T20Is

ఈ ఓవర్ తొలి బంతిని రోహిత్ శర్మ బౌండరీ బాదాడు. రెండో బంతిని కరీమ్ జనత్ నోబాల్ వేయగా డీప్ మిడ్‌ వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు. ఎక్స్‌ట్రా డెలివరీని రోహిత్ లాంగాన్ దిశగా సిక్సర్‌ కొట్టాడు. మరుసటి బంతిని కట్టుదిట్టంగా వేయడంతో సింగిల్ తీసిన రోహిత్ స్ట్రైకింగ్‌ను రింకూ సింగ్‌కు ఇచ్చాడు. ఇక రింకూ సింగ్ చివరి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు.

అక్రాస్ దిలైన్, ఫుల్ టాస్, షార్ట్ పిచ్ బాల్స్‌ను రింకూ సింగ్ ఓవర్ డీప్ మిడ్, డీప్ మిడ్, ఓవర్ డీప్ స్క్వేర్ దిశగా సిక్సర్లు రాబట్టి కరీమ్ జనత్‌కు చుక్కలు చూపించాడు. రోహిత్-రింకూ సింగ్ ధాటికి కరీమ్ జనత్ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన అఫ్గాన్ బౌలర్‌గా చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు.

ఇక ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లుగా రింకూ సింగ్, రోహిత్ రికార్డు సాధించారు. అంతర్జాతీయ టీ20ల్లో యువరాజ్ సింగ్, కీరన్ పోలార్డ్ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది 36 పరుగులు పిండుకోగా.. తాజాగా రోహిత్, రింకూ సింగ్ సంయుక్తంగా 36 పరుగులు చేసి వారి సరసన చేరారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్) రికార్డ్ సెంచరీతో చెలరేగగా.. రింకూ సింగ్(39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీ సత్తా చాటాడు.

22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్-రింకూ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరూ చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ తీసాడు.

Story first published: Wednesday, January 17, 2024, 21:22 [IST]
Other articles published on Jan 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+