For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AFG: డబుల్ సూపర్ ఓవర్‌లో భారత్‌ను గెలిపించిన రవి బిష్ణోయ్!

IND vs AFG: సూపర్ ఓవర్‌లో ఓటమెరుగని టీమిండియా.. తమ అద్వితీయమైన రికార్డ్‌ను కొనసాగించింది. అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి డబుల్ సూపర్ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ సంచలన బౌలింగ్‌తో విజయాన్నందుకుంది.

బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో థ్రిల్లింగ్ విక్టీరీని అందుకున్న టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

విజయం కోసం అద్భుతంగా పోరాడిన అఫ్గానిస్థాన్.. రెండో సూపర్ఓవర్‌లో చేతులెత్తేసింది. మూడు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయి ఓటమికి తల ఒంచింది.

IND vs AFG: Ravi Bishnoi helps India beat Afghanistan after 2nd Super Over in thriller

రోహిత్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్) రికార్డ్ సెంచరీతో చెలరేగగా.. రింకూ సింగ్(39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్-రింకూ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ తీసాడు.

స్కోర్లు టై..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. అఫ్గాన్ టాప్-3 బ్యాటర్లు రెహ్మనుల్లా గుల్బాదిన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50), ఇబ్రహీమ్ జడ్రాన్(41 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50), గుల్బాదిన్ నైబ్(23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/18) మూడు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

తొలి సూపర్ ఓవర్‌‌లో..
ముఖేష్ కుమార్ వేసిన సూపర్ ఓవర్‌లో తొలి బంతికి గుల్బాదిన్ రనౌటయ్యాడు. క్రీజులోకి నబీ రాగా.. గుర్బాజ్ బౌండరీ బాదాడు. అనంతరం నబీ సిక్సర్ బాదడం.. చివరి బంతికి బైస్ రూపంలో 3 పరుగులు రావడంతో అఫ్గాన్ 16 పరుగులు చేసింది. 17 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగగా.. ఒమర్జాయ్ వేసిన తొలి రెండు బంతులకు సింగిల్స్ మాత్రమే వచ్చాయి.

తర్వాతి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన రోహిత్ శర్మ ఐదో బంతికి సింగిల్ తీసాడు. దాంతో చివరి బంతికి భారత్ విజయానికి 2 పరుగులు అవసరవమ్వగా.. సింగిలే రావడంతో రెండో సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

రెండో సూపర్ ఓవర్‌లో..
రెండో సూపర్ ఓవర్‌లో ఫరీద్ అహ్మద్ బౌలింగ్ చేయగా.. రింకూ సింగ్, రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు దిగారు. తొలి రెండు బంతులును 6,4గా మలిచిన రోహిత్ మూడో బంతికి సింగిల్ తీసాడు. నాలుగో బంతికి రింకూ సింగ్ క్యాచ్ ఔటవ్వగా.. సంజూ శాంసన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే అతను బ్యాట్‌ను బంతికి కూడా టచ్ చేయకపోగా.. క్విక్ సింగిల్ తీసే ప్రయత్నంలో రోహిత్ రనౌటయ్యాడు. దాంతో టీమిండియా 11 పరుగులకు ఆలౌటైంది.

11 పరుగులను డిఫెండ్ చేసేందుకు రవి బిష్ణోయ్ రంగంలోకి దిగగా... అఫ్గాన్ తరఫున నబీ, గుర్జాజ్ బ్యాటింగ్ చేశారు. తొలి బంతికి నబీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. నబీ ఆడిన భారీ షాట్‌ను లాంగాన్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ అందుకున్నాడు. రెండో బాల్‌కు సింగిల్ రాగా.. మరుసటి బంతికి గుర్బాజ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగడంతో భారత విజయం లాంఛనమైంది.

IND vs AFG: Ravi Bishnoi helps India beat Afghanistan after 2nd Super Over in thriller

అదిరిపోయే ఆరంభం..
213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్‌కు ఓపెనర్లు రెహ్ముల్లా గుర్బాజ్, ఇబ్రహీమ్ జడ్రాన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన ఈ జోడి 10 ఓవర్లలోనే 85 పరుగులు చేసింది. 29 బంతుల్లో రెహ్మనుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచరీ చేయగా..అతన్ని కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి తొలి వికెట్‌కు నమోదైన 93 పరుగులు భాగస్వామ్యానికి తెరదించాడు.

అనంతరం ఇబ్రహీం జడ్రాన్ 41 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకోగా అతన్ని వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి బంతికే అజ్మతుల్లా ఒమర్జాయ్(0)‌ను గోల్డెన్ డక్‌గా వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో మహ్మద్ నబీ, గుల్బాది నబీ ధాటిగా ఆడారు. 56 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని వాషింగ్టన్ సుందర్ విడదీసాడు.

గుల్బాదిన్ సూపర్ బ్యాటింగ్..
మహమ్మద్ నబీ(34) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కరీం జనత్(2)‌ను సంజూ శాంసన్ రనౌట్ చేయగా.. నజిబుల్లా జడ్రాన్(5)ను ఆవేశ్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. బౌండరీ లైన్ వద్ద విరాట్ కోహ్లీ అందుకున్న సూపర్ క్యాచ్‌తో నజిబుల్లా జడ్రాన్ పెవిలియన్ చేరాడు.

ఇక చివరి ఓవర్‌లో అఫ్గాన్ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. ముఖేశ్ కుమార్ వేసిన ఈ ఓవర్‌లో గుల్బాదిన్ ఓ సిక్స్, ఫోర్‌తో పాటు సింగిల్స్‌తో 18 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. రెండు వైడ్స్ వేయడం అఫ్గాన్‌‌కు కలిసొచ్చింది.

Story first published: Wednesday, January 17, 2024, 23:31 [IST]
Other articles published on Jan 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+