For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AFG: సూర్య X రషీద్ ఖాన్ డిష్యూం డిష్యూం (వీడియో)

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్, అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మధ్య ఫన్నీ ఫైట్ జరిగింది.

సూర్యకుమార్ యాదవ్ స్వీప్ షాట్స్‌కు విసిగిపోయిన రషీద్ ఖాన్.. సూర్య దగ్గరకు వెళ్లి ఆ షాట్స్ ఆడవద్దని హెచ్చరించాడు. స్వీప్ షాట్స్ ఆడితే బాగుండదని చెప్పాడు. దానికి సూర్య 'నీ మాట వినేది ఏందిరా..?'అన్నట్లు బదులిచ్చాడు. రషీద్ వార్నింగ్ తర్వాత సూర్య స్వీప్ షాట్స్‌తోనే రెండు బౌండరీలు, ఓ సిక్స్ బాదాడు.

IND vs AFG Rashid Khan walks up to Suryakumar Yadav after India batter sweeps him for four six

ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఘటనకు సంబంధించి కామెంటేటర్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. స్వీప్ షాట్స్ ఆడవద్దని రషీద్ ఖాన్.. సూర్యని కోరాడని చెప్పిన రవి శాస్త్రి.. అందులో తన తప్పులేదని సూర్య బదులిచ్చాడని తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ(3/33), రషీద్ ఖాన్(3/26) మూడేసి వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. అజ్మతుల్లా ఒమర్జాయ్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26) టాప్ స్కోరర్‌గా నిలిచారు. జస్‌ప్రీత్ బుమ్రా(3/7), అర్ష్‌దీప్ సింగ్(3/36) అఫ్గాన్ పతనాన్ని శాసించారు.

హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్య.. టీ20 క్రికెట్‌లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్న రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్‌ను సూరీడు సమం చేశాడు.

సారి. గ్రూప్ దశలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో బౌలర్లే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నారు. టీ20 కెరీర్‌లో ఇది సూర్యకు 15వ అవార్డ్. 64 టీ20 మ్యాచ్‌ల్లో సూర్య ఈ ఫీట్ సాధించడం విశేషం. విరాట్ కోహ్లీ మాత్రం 121 మ్యాచ్‌ల్లో 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్నాడు.

Story first published: Friday, June 21, 2024, 12:45 [IST]
Other articles published on Jun 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+