అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరగనున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడటం లేదని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. వ్యక్తిగత కారణాలతో అతను తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడని స్పష్టం చేశాడు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ గత 14 నెలలుగా టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఈ ఇద్దరూ ఆటగాళ్లు చివరిసారిగా ఆడారు. ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో మళ్లీ టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రోహిత్, కోహ్లీ సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే అఫ్గాన్‌తో సిరీస్‌కు ఎంపికయ్యారు. అయితే చివరి నిమిషంలో కోహ్లీ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.

మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20 నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదని చెప్పాడు. వ్యక్తిగత కారణాలతో అతను జట్టుకు దూరమయ్యాడని, బెంగళూరు వేదికగా జనవరి 14న జరిగే రెండో టీ20కి అందుబాటులోకి వస్తాడని చెప్పాడు.
అసత్య ప్రచారం..
ఇక శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. ప్రస్తుత టీ20 జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు లేదని, విరాట్ కోహ్లీ రాకతో అతని దారులు మూసుకుపోయాయని తెలిపాడు. ఇక మానసిక సమస్యలతో జట్టుకు దూరంగా ఉన్న ఇషన్ కిషన్.. ఈ సిరీస్‌కు కూడా అందుబాటులోకి రాలేదని, అందుకే అతన్ని ఎంపిక చేయలేదని రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు.
జట్టులో చోటు లేదు..
ఈ ఇద్దరి గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని తెలిపాడు. 'శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడం వెనుక ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేవు. అతనికి జట్టులో చోటు లేదు. ఇప్పటికే జట్టులో చాలా మంది బ్యాటర్లు ఉన్నారు. సౌతాఫ్రికా పర్యటనలో కూడా అతను టీ20లు ఆడలేదనే విషయాన్ని గుర్తించాలి. చాలా మంది బ్యాటర్లు ఉన్నప్పుడు అందరికీ అవకాశం ఇవ్వడం అంత సులువు కాదు.'అని ద్రవిడ్ తెలిపాడు.
ఇక షాట్ పిచ్ బాల్స్ సమస్యను శ్రేయస్ అయ్యర్ ఎంతకీ అధిగమించకపోవడంతోనే అతన్ని అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదని, క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని నేషన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక సౌతాఫ్రికా పర్యటన నుంచి మధ్యలో వచ్చేసిన ఇషాన్ కిషన్.. వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లడంపై కూడా బీసీసీఐ ఆగ్రహంగా ఉందని, అందుకే టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదనే కథనాలు కూడా వచ్చాయి. ఈ ప్రచారాన్ని ద్రవిడ్ ఖండించాడు.