Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: భారత జట్టులో కీలక మార్పు.. గంభీర్ ప్రియ శిష్యుడికి చోటు!

అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డే‌కు ముందు టీమిండియాలో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం నుంచి కోలుకున్న పేస్ ఆల్ రౌండర్ హర్షిత్ రాణా భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌లో రాణా మోకాలికి గాయం కావడంతో అతను మెగా టోర్నీతో పాటు ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే.

IND vs AFG: సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియా!

IND vs AFG: సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియా!

బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స తీసుకున్న రాణా పూర్తిగా కోలుకొని మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు. నితీష్ కుమార్ రెడ్డితో పాటు హర్షిత్ రాణాను పేస్ ఆల్‌రౌండర్‌గా వన్డే ప్రపంచకప్ టోర్నీకి సిద్దం చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ ఇద్దర్ని హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా సిద్దం చేయాలనే లక్ష్యంతో ఉంది.

IND vs AFG Pacer Harshit Rana Added to India s Squad for Third ODI in Chennai After Successful Injury Rehab

అంతేకాకుండా హర్షిత్ రాణా.. గంభీర్‌కు ప్రియ శిష్యుడనే అభిప్రాయం కూడా ఉంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత్ 2-0 ఆధిక్యంలో ఉన్నందున రాబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలను దృష్టిలో ఉంచుకుని హర్షిత్ రాణాను ఎంపిక చేసినట్లు అర్థమవుతుంది. శనివారం చెన్న వేదికగా అఫ్గానిస్థాన్‌తో టీమిండియా మూడో వన్డే ఆడనుంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది.


మూడో వన్డే కోసం టీమిండియా జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా.

IND vs AFG: అఫ్గాన్ చిత్తు.. సిరీస్ భారత్ కైవసం!

IND vs AFG: అఫ్గాన్ చిత్తు.. సిరీస్ భారత్ కైవసం!
Story first published: Friday, June 19, 2026, 11:05 [IST]
Other articles published on Jun 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+