IND vs AFG: మానవ్ సుతార్ ‘సిక్సర్’.. అఫ్గాన్ బేజార్!
అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. తొలుత బ్యాటింగ్‌లో భారీ స్కోర్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత తమకు అలవాటైన రీతిలో ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో బిగించింది. అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్(6/140) సిక్సర్‌తో అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు కుప్పకూలింది.
18.5 ఓవర్ల వ్యవధిలోనే అఫ్గాన్ తమ చివరి 5 వికెట్లు కోల్పోయింది. రెహ్మత్ షా(135 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 60) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్‌కు తోడుగా ప్రసిధ్ కృష్ణ(3/37) మూడు వికెట్లతో సత్తా చాటాడు. వాషింగ్టన్ సుందర్(1/21) ఒక వికెట్ దక్కింది. భారత్‌కు 412 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. టెస్ట్ క్రికెట్ అనుభవలేమి అఫ్గాన్ కొంపముంచింది.
సుతార్ తీన్మార్..
113/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన అఫ్గాన్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్(0)ను ప్రసిధ్ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు. షరాఫుద్దీన్ అష్రఫ్‌తో కలిసి రెహ్మత్ షా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో అతను 100 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ అష్రఫ్(11)ను మానవ్ సుతార్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

తన మరుసటి ఓవర్‌లో రెహ్మత్ షా(60)ను క్లీన్ బౌల్డ్ చేసి ఐదు వికెట్ల ఘనతో పాటు అఫ్గాన్ పతనాన్ని శాసించాడు. అదే ఓవర్‌లో మహమ్మద్ సలీమ్(0)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించిన మానవ్ సుతార్.. 6 వికెట్ల ఘనతను అందుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ఘనతను అందుకున్న 10వ భారత బౌలర్‌గా రికార్డ్ సాధించాడు. జియూర్ రెహ్మాన్(6)ను ఆఖరి వికెట్‌గా వాషింగ్టన్ సుందర్‌ను పెవిలియన్ చేర్చడంతో అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అఫ్గాన్ ఫాలో ఆన్ అందుకోకపోవడంతో ఆ జట్టే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.
భారత్ భారీ స్కోర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 127 ఓవర్లలో 564/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. శుభ్‌మన్ గిల్(177 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 126), కేఎల్ రాహుల్(165 బంతుల్లో 11 ఫోర్లతో 100), రిషభ్ పంత్(121 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81), వాషింగ్టన్ సుందర్(68 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

