Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: అఫ్గానిస్థాన్ ఘోర తప్పిదం!(వీడియో)

భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో అఫ్గానిస్థాన్ ఘోర తప్పిదం చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఔటైనా నిలకడగా ఆడుతోంది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు.

అయితే అఫ్గానిస్థాన్ చేసిన తప్పిదంతో కేఎల్ రాహుల్ క్యాచ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అఫ్గాన్ డీఆర్‌ఎస్ తీసుకొని ఉంటే కేఎల్ రాహుల్ 16 పరుగులకే వెనుదిరిగేవాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అంపైర్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అఫ్గాన్ అభిమానులు టీమిండియా తొండాట అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

క్యాచ్ ఔటైనా..

జియావుర్ రెహ్మాన్ వేసిన 11వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని రెహ్మాన్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. రాహుల్ బ్యాక్‌ఫుట్‌లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో అతను విఫలమవ్వడంతో బ్యాట్‌ను ముద్దాడుతూ కీపర్ చేతిలో పడింది. వెంటనే అఫ్గాన్ ఆటగాళ్లు గట్టి అప్పీల్ చేశారు. కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.

IND vs AFG KL Rahul Survives Early Scare After Afghanistan s Blunder of Not Reviewing Major Error in New Chandigarh Test
Photo Credit: screen grab for JioHotstar

రాహుల్ కూడా నాటౌట్ అన్నట్లు తలూపాడు. డీఆర్‌ఎస్ ఆప్షన్ ఉన్నప్పటికీ.. మ్యాచ్ ఆరంభమే కదా? అని అఫ్గాన్ రిస్క్ తీసుకోలేకపోయింది. కానీ ఆ తర్వాత రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దాంతో అఫ్గాన్ ఆటగాళ్లు తల పట్టుకోగా.. రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు.

రివ్యూ తీసుకొని ఉంటే..

ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకుంటున్నాడు. సాయి సుదర్శన్‌తో కలిసి జట్టు స్కోర్‌ను 100 ధాటించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అఫ్గాన్ రివ్యూ తీసుకొని ఉంటే రాహుల్ ఔటయ్యేవాడు. టీమిండియా కూడా ఒత్తిడికిలోనయ్యేది. ప్రస్తుత భారత జట్టులో రాహుల్ మాత్రమే అత్యంత సీనియర్ ఆటగాడు. అలాంటి వికెట్‌ను తీసే అవకాశాన్ని అఫ్గాన్ చేజార్చుకుంది.

Story first published: Saturday, June 6, 2026, 12:38 [IST]
Other articles published on Jun 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+