Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..!

టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 94 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలోనే కని వినీ ఎరుగని విజయాన్ని కైవసం చేసుకుంది. ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో సోమవారం ముగిసిన ఏకైక టెస్ట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్‌లో భారీ స్కోర్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత తమకు అలవాటైన రీతిలో స్పిన్‌తో ప్రత్యర్థికి ఉచ్చు బిగించింది. టెస్ట్‌ల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం. 2018లో వెస్టిండీస్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 272 రన్స్‌తో గెలుపొందింది. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద విజయంగా ఉండగా.. తాజా ఫలితం దాన్ని అధిగమించింది.

భారత్ గడ్డపై ఇది రెండో అతిపెద్ద టెస్ట్ విజయం. 1958లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై వెస్టిండీస్ ఇన్నింగ్స్ 336 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ రికార్డ్ ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది.

తాజా ఫలితంతో టెస్ట్‌ల్లో అతిపెద్ద విజయం సాధించిన రెండో ఆసియా టీమ్‌గా భారత్ నిలిచింది. ఈ జాబితాలో భారత్ కంటే పాకిస్థాన్ ముందుంది. 2002లో లాహోర్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ ఇన్నింగ్స్ & 324 పరుగుల తేడాతో గెలుపొందింది.

IND vs AFG India Scripts History With Record-Breaking Innings and 300-Run Victory Over Afghanistan in Mullanpur Test

టెస్ట్‌ల్లో భారత్ సాధించిన భారీ ఇన్నింగ్స్ విజయాలు

ఇన్నింగ్స్ & 300 పరుగులు వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (AFG), ముల్లన్‌పూర్, 2026*

ఇన్నింగ్స్ & 272 పరుగులు వర్సెస్ వెస్ట్ ఇండీస్ (WI), రాజ్‌కోట్, 2018

ఇన్నింగ్స్ & 262 పరుగులు వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (AFG), బెంగళూరు, 2018

ఇన్నింగ్స్ & 239 పరుగులు వర్సెస్ బంగ్లాదేశ్ (BAN), మీర్‌పూర్, 2007

ఇన్నింగ్స్ & 239 పరుగులు వర్సెస్ శ్రీలంక (SL), నాగ్‌పూర్, 2017

IND vs AFG: చరిత్ర సృష్టించిన మానవ్ సుతార్.. 59 ఏళ్ల రికార్డ్ బద్దలు!

IND vs AFG: చరిత్ర సృష్టించిన మానవ్ సుతార్.. 59 ఏళ్ల రికార్డ్ బద్దలు!


టెస్టుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కొన్న ఇన్నింగ్స్ ఓటములు

ఇన్నింగ్స్ & 300 పరుగులు వర్సెస్ ఇండియా (IND), ముల్లన్‌పూర్, 2026*

ఇన్నింగ్స్ & 262 పరుగులు వర్సెస్ ఇండియా (IND), బెంగళూరు, 2018

ఇన్నింగ్స్ & 73 పరుగులు వర్సెస్ జింబాబ్వే (ZIM), హరారే, 2025

టెస్టుల్లో ఆఫ్ఘనిస్తాన్ (AFG) నమోదు చేసిన అత్యల్ప స్కోర్లు

103 వర్సెస్ ఇండియా (IND), బెంగళూరు, 2018

109 వర్సెస్ ఇండియా (IND), బెంగళూరు, 2018

112 వర్సెస్ ఇండియా (IND), ముల్లన్‌పూర్, 2026*

115 వర్సెస్ బంగ్లాదేశ్ (BAN), మీర్‌పూర్, 2023

120 వర్సెస్ వెస్ట్ ఇండీస్ (WI), లక్నో, 2019

సంక్లిప్త స్కోర్లు

భారత్ తొలి ఇన్నింగ్స్ 564/8 డిక్లెర్డ్ (శుభ్‌మన్ గిల్ 126, కేఎల్ రాహుల్ 100)

అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 152 ఆలౌట్( రెహ్మాత్ షా 60, మానవ్ సుతార్ 6/33)

అఫ్గానిస్థాన్ రెండో ఇన్నింగ్స్ 112 ఆలౌట్ (సెదిఖుల్లా అటల్ 42, వాషింగ్టన్ సుందర్ (4/36), కుల్దీప్ యాదవ్(3/30)

సూర్యకుమార్ యాదవ్‌పై ముంబై ఇండియన్స్ వేటు..?

సూర్యకుమార్ యాదవ్‌పై ముంబై ఇండియన్స్ వేటు..?
Story first published: Monday, June 8, 2026, 16:02 [IST]
Other articles published on Jun 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+