Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ పేసర్ ఔట్!

అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ హర్షిత్ రాణా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. జూలైలో ఇంగ్లండ్ పర్యటనలో హర్షిత్ రాణా తొడ కండరాల గాయానికి గురయ్యాడు. అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు అతన్ని ఎంపిక చేసిన సెలెక్టర్లు ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే జట్టులో కొనసాగుతాడని స్పష్టం చేశాడు.

Viral Video: వైభవ్ సూర్యవంశీ vs తిలక్ వర్మ.. డిష్యూం.. డిష్యూం! (వీడియో)

Viral Video: వైభవ్ సూర్యవంశీ vs తిలక్ వర్మ.. డిష్యూం.. డిష్యూం! (వీడియో)

అయితే అతను గాయం నుంచి ఇంకా రికవరీ కాలేదని తెలుస్తోంది. ఆసియా గేమ్స్‌కు కూడా అతను అందుబాటులో ఉండటంపై సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలోనే బుమ్రాకు మోకాలి గాయమైంది. దాంతో అతను శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.

IND vs AFG Harshit Rana Set to Miss T20I Series Doubtful for Asian Games Bumrah Boost for India

తాజాగా అతను ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేశాడని, జట్టుకు అందుబాటులోకి వచ్చాడని బెంగళూరులోని సీఓఈ వర్గాలు పేర్కొన్నాయి. బుమ్రాతో పాటు తెలుగు తేజం, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో నలుగురు ఆటగాళ్లు ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయాల్సింది. ఇందులో వాషింగ్టన్ సుందర్ ఇప్పటికే అర్హత సాధించగా.. బుమ్రా, నితీష్ రెడ్డి తాజాగా క్లియర్ చేశారు. హర్షిత్ రాణా ఒక్కడే ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు.

సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో న్యూఢిల్లీ వేదికగా మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అనంతరం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు.. ఆసియా గేమ్స్ కోసం జపాన్‌‌కు వెళ్లనుంది. ఇక ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను బీసీసీఐ నిశితంగా పరిశీలించనుంది.

వైభవ్ సూర్యవంశీ.. ఉరుకులాట ఉత్త చాట!

Also Read

వైభవ్ సూర్యవంశీ.. ఉరుకులాట ఉత్త చాట!

అఫ్గాన్‌తో సిరీస్‌కు భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(కీపర్), సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్) శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా*, హర్షిత్ రాణా*, నితీష్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్‌*.

Story first published: Thursday, September 10, 2026, 11:21 [IST]
Other articles published on Sep 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+