Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: హార్దిక్ పాండ్యాకు మరో గాయం.. వన్డే సిరీస్‌కు దూరం!

అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేసి జట్టుకు అందుబాటులోకి వచ్చిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో గాయానికి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొడ కండరాల గాయంతో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

ఈ సిరీస్‌తోనే టీమిండియా వన్డే ప్రపంచకప్ సన్నాహకాలను ప్రారంభించనుంది. అయితే హార్దిక్ పాండ్యా తొడ కండరాల గాయానికి గురయ్యాడని, కోలుకోవడానికి 3 వారాలు పడుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

IND vs SL: వైభవ్ సూర్యవంశీ విఫలం!

IND vs SL: వైభవ్ సూర్యవంశీ విఫలం!

బౌలింగ్ చేసే క్రమంలో..

ఐపీఎల్ 2026 సీజన్ సమయంలోనే హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పితో బాధపపడ్డాడు. దాంతో అతను 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా.. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రిహాబిలిటేషన్‌ పూర్తి చేసుకున్నాడు. ఫిట్‌నెస్ టెస్ట్‌ను కూడా క్లియర్ చేశాడు. అయితే 10 ఓవర్లు ఫుల్ కోటా అసైన్‌మెంట్ పూర్తి చేసే క్రమంలో హార్దిక్ పాండ్యాకు గాయమైనట్లు తెలుస్తోంది.

IND vs AFG Hardik Pandya Ruled Out Of Afghanistan ODI Series After Virat Kohli

'హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకోవడానికి మూడు వారాల సమయం పడుతుంది. అతని రిహాబిలిటేషన్ ఇంకా పూర్తి కాలేదు. అతను వన్డే సిరీస్ ఆడే అవకాశం లేదు.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు.

కోహ్లీ దూరం..

ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్లో విరాట్ కోహ్లీ గాయపడగా.. అతని స్థానంలో సెలెక్టర్లు యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేశారు. కోహ్లీ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. జూన్ 13న ధర్మశాలలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి వన్డే జరగనుండగా.. రెండో వన్డే 17న లక్నోలో.. చివరి వన్డే 20న చెన్నై వేదికగా జరగనుంది. అయితే హార్దిక్ పాండ్యా గాయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. అతనికి రిప్లేస్‌మెంట్‌ కూడా ప్రకటించలేదు.

భారత వన్డే జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.

IPL 2027: కావ్య మారన్ కీలక నిర్ణయం.. అతనిపై వేటు!

IPL 2027: కావ్య మారన్ కీలక నిర్ణయం.. అతనిపై వేటు!
Story first published: Wednesday, June 10, 2026, 13:00 [IST]
Other articles published on Jun 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+