Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: SRH ఆటగాళ్లకు అన్యాయం!

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరుగురు బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, ఒక ప్రాపర్ ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగింది.

బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డితో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ హర్ష్‌దూబేకు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కలేదు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన మానవ్ సుతార్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడబోతుందని, అందులో ఏడు మ్యాచ్‌లు భారత్‌లోనే ఉన్నాయని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. హోమ్ టెస్ట్ మ్యాచ్‌లకు తగ్గట్లుగా కాంబినేషన్‌ను సెట్ చేయాల్సిన అవసరం ఉందని, ఆ క్రమంలోనే ఈ మ్యాచ్‌ను ప్రయోగాలకు వాడుకుంటున్నామని టాస్ సందర్భంగా తెలిపాడు.

IND vs AFG Gautam Gambhir Faces Fan Backlash and Memes After Nitish Kumar Reddy and Harsh Dubey Omission From Playing XI

బ్యాటింగ్‌ డెప్త్‌కు ప్రాధాన్యత ఇస్తూ.. బౌలింగ్‌ విభాగం బలహీన పడకుండా జట్టును సెట్ చేయాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఈ మ్యాచ్‌కు ముందే గంభీర్ తన వ్యూహాలను వెల్లడించాడు. శ్రీలంక పర్యటనకు నలుగురు స్పిన్నర్లను సిద్దం చేయాలనుకుంటున్నామని చెప్పాడు. ఆ క్రమంలోనే మానవ్ సుతార్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ స్లో అయ్యే అవకాశం ఉండటంతో నితీష్ కుమార్ రెడ్డికి బదులు ప్రాపర్ బ్యాటర్ అయిన ధ్రువ్ జురెల్‌ను ఆడిస్తున్నట్లు అర్థమవుతుంది.

అయితే ఈ నిర్ణయాన్ని భారత అభిమానులు తప్పుబడుతున్నారు. బ్యాటింగ్ డెప్త్‌తో పాటు బౌలింగ్ కూడా ముఖ్యమేనని కామెంట్ చేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబేలకు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. కొందరైతే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లకు అన్యాయం జరిగిందని కామెంట్ చేస్తున్నారు. తుది జట్టు ఎంపికలో ఫేవరిటిజం కనిపించిందని, శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. రంజీ ట్రోఫీలో మానవ్ సుతార్ కంటే హర్ష్ దూబే మెరుగైన ప్రదర్శన కనబర్చాడని కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు.

భారత్ తుది జట్టు: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

Story first published: Saturday, June 6, 2026, 10:24 [IST]
Other articles published on Jun 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+