For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AFG: ఒక్కటైన కోహ్లీ, నవీన్ ఉల్ హక్.. గౌతమ్ గంభీర్ రియాక్షన్ ఏంటంటే.?

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అఫ్గానిస్థాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ ఒక్కటయ్యారు. తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు, గొడవలను పక్కనపెట్టి కలిసిపోయారు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం ఢిల్లీ వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా మైదానంలో ఈ ఇద్దరి మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి వాగ్వాదం పెద్దదిగా మారి ఒకరిపై మరొకరు దూసుకెళ్లే వరకు వెళ్లింది. సోషల్ మీడియా వేదికగా కూడా మాటల యుద్దం నడిచింది. చివరకు గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య కూడా వాగ్వాదం జరిగేలా చేసింది. ఈ విషయాన్ని కోహ్లీ వదిలేసినా.. నవీన్ ఉల్ హక్ విడిచిపెట్టలేదు.

IND vs AFG: Gautam Gambhir Reacts After Virat Kohli, Naveen Ul Haq Share Warm Hug in World Cup 2023

సోషల్ మీడియా వేదికగా కోహ్లీని రెచ్చగొట్టే పోస్ట్‌లు పెట్టాడు. కోహ్లీ పట్టించుకోకపోయినా అతని ఫ్యాన్స్ మాత్రం నవీన్ ఉల్ హక్‌ను వదిలేయలేదు. అతను ఆడిన ప్రతీ మ్యాచ్‌లో కోహ్లీ పేరుతో నామస్మరణ చేస్తూ అతనిపై ట్రోలింగ్‌కు దిగారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే భారత్-అఫ్గాన్ పోరు అనగానే అందరూ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య పోరుగా భావించారు.

కానీ ఈ ఇద్దరూ కలిసిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచారు. నవీన్ ఉల్ హక్‌ను ట్రోల్ చేయవద్దని కోహ్లీ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఇక నవీన్ ఉల్ హక్ సైతం కోహ్లీ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య ఉన్న గొడవను ఆపేద్దామని కోహ్లీ కోరగా.. నవీన్ ఉల్ హక్ ఒప్పుకున్నాడు. అనంతరం నవ్వుతూ ఇద్దరూ హగ్ చేసుకున్నారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన గంభీర్.. ఈ ఘటనపై స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ' ఏ ఆటగాడైనా మైదానంలోనే పోరాడాలి. ఫీల్డ్ బయట కాదు. ప్రతీ ఒక్క ప్లేయర్‌కు తమ జట్టు విజయం కోసం పోరాడే హక్కు ఉంటుంది. అలాగే గౌరవం కోసం పోరాడే అధికారం కూడా ఉంది. అది ఏ దేశమనేది అవసరం లేదు.

నువ్వు ఎంత అద్భుత ఆటగాడివనేది కూడా సంబంధం లేదు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్‌ల్‌ హక్‌ను ఇలా చూడటం చాలా బాగుంది. ఎట్టకేలకు ఐపీఎల్ గొడవకు ముగింపు పడినట్లే. ఇదే సమయంలో క్రికెట్ అభిమానులకు కూడా ఓ రిక్వెస్ట్. మైదానంలోకానీ, సోషల్ మీడియా వేదికగా కానీ ఏ ఆటగాడినైనా సరే సరదా కోసం కూడా ట్రోలింగ్ చేవద్దు.

జాతీయ జట్టు తరఫున ఆడాలనేది ప్రతి క్రికెటర్‌ కల. దాని కోసం వారు ఎంతో శ్రమించి ఇక్కడి వరకు వస్తారు. ఇక నవీన్ ఉల్‌ హక్‌ అఫ్గాన్‌ వంటి దేశం నుంచి ఐపీఎల్‌ వంటి వరల్డ్ బెస్ట్ లీగ్‌లో ఆడటం గొప్ప విషయం'అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 12, 2023, 16:48 [IST]
Other articles published on Oct 12, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+