శుభ్‌మన్ గిల్.. టీమిండియా నీ అయ్య జాగీరా?
ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో అంతర్జాతీయ సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌తో ఒక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. శనివారం(జూన్ 6) నుంచి న్యూఛండీఘర్ వేదికగా ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికీ ఈ రెండు సిరీస్‌లకు సంబంధించిన భారత జట్లను అజిత్ అగార్కర్ సారథ్యంలోనే సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.
అయితే ఈ ఏకైక టెస్ట్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రంజీ ట్రోఫీలో 60 వికెట్లతో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకీబ్ నబీని ఎంపిక చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. రంజీ ట్రోఫీ ప్రదర్శనలకు విలువ లేనప్పుడు ఆ టోర్నీని కొనసాగించడం ఎందుకు? అంటూ మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఆకీబ్ నబీ స్థానంలో పంజాబ్‌కు చెందిన గుర్నూర్ బ్రార్‌ను ఎంపిక చేయడం చర్చనీయాంశమైంది. నబీతో పోల్చితే గుర్నూర్ బ్రార్ ఏ స్థాయిలోనూ కనీస పోటీ కాదు. కానీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అండదండలతో అతను జట్టులోకి వచ్చాడనే విషయం స్పష్టమవుతోంది. అంతేకాకుండా గుజరాత్ టైటాన్స్‌కు చెందిన ఏడుగురు ఆటగాళ్లు ఈ టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికకావడం సెలెక్టర్ల పక్షపాతానికి నిదర్శనంగా నిలుస్తోంది. శుభ్‌మన్ గిల్ సెలెక్టర్లను ప్రభావితం చేస్తున్నాడనే విషయం స్పష్టమవుతోంది.
గుజరాత్ టైటాన్స్‌కు చెందిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్‌లు టెస్ట్ టీమ్‌లోకి ఎంపికయ్యారు. ఈ జట్టును చూసిన నెటిజన్లు సెలెక్టర్లతో పాటు శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకప్పుడు ముంబై క్రికెటర్ల హవా నడిచేదని, గత కొంతకాలంగా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగుతోందని కామెంట్ చేస్తున్నారు. ఇది టీమిండియా టెస్ట్ టీమా..? లేక గుజరాత్ టైటాన్స్ జట్టా? అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొందరైతే.. టీమిండియా ఏమైనా శుభ్‌మన్ గిల్.. అయ్య జాగీరా? అని ప్రశ్నిస్తున్నారు.
అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌కు భారత జట్టు: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్‌దూబే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

