Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: టీమిండియా విజయం వెనుక కోహ్లీ కళ్లు చెదిరే ఫీల్డింగ్! (వీడియో)

అఫ్గానిస్థాన్‌తో డబుల్ సూపర్ ఓవర్‌కు దారి తీసిన మూడో టీ20లో టీమిండియా సంచలన విజయాన్ని అందుకుంది. బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన ఈ హైస్కోరింగ్ మ్యాచ్‌‌లో ఇరు జట్ల స్కోర్లు సమం అవ్వగా.. రెండు సూపర్ ఓవర్లు నిర్వహించాల్సి వచ్చింది. అంతర్జాతీయ టీ20ల్లో డబుల్ సూపర్ ఓవర్ ఆడటం ఇదే తొలిసారి.

సెకండ్ సూపర్ ఓవర్‌లో రవి బిష్ణోయ్ సంచలన బౌలింగ్‌తో టీమిండియా విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత విజయం వెనుక రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్‌, రవి బిష్ణోయ్ సంచలన బౌలింగ్‌తో పాటు విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే ఫీల్డింగ్ కూడా ఉంది. మైదానంలో చిరుతలా కదిలిన విరాట్ కోహ్లీ.. బౌండరీ లైన్ వద్ద సూపర్ మ్యాన్ స్టంట్‌తో ఓ సిక్సర్‌ను ఆపడంతో పాటు ఉసెన్ బోల్ట్‌లా పరుగెత్తి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

IND vs AFG: Fans Says Virat Kohli incredible fielding efforts to save India in 3rd T20I

వేగంగా కదిలి చాలా పరుగులు సేవ్ చేశాడు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ వేసిన 17వ ఓవర్‌లో కరీమ్ జనత్ కొట్టిన భారీ సిక్సర్‌ను బౌండరీ లైన్ వద్ద విరాట్ కోహ్లీ ఆపిన తీరు ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. సుందర్ వేసిన షాట్ బాల్‌ను జనత్ బ్యాక్ ఫుట్‌లో భారీ షాట్ ఆడాడు. అతని పవర్ ఫుల్ షాట్‌కు బంతి లాంగాన్ దిశగా సిక్సర్‌గా దూసుకెళ్లింది. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ 5.8 మీటర్ల ఎత్తు ఎగిరి బంతిని అడ్డుకొని చాకచక్యంగా లోపలికి విసిరేసాడు. దాంతో సిక్సర్ కాస్త సింగిల్‌గా మారింది.

ప్రస్తుతం ఈ ఫీల్డింగ్ స్టంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సిక్సర్‌ను కోహ్లీ ఆపకపోయి ఉంటే మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కు దారి తీసేది కాదని, అఫ్గాన్‌కు విజయం దక్కేదని మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో భారత విజయం వెనుక రోహిత్, రవి బిష్ణోయ్‌లది ఎంత పాత్ర ఉందో.. కోహ్లీది అంతే ఉందని ప్రశంసిస్తున్నారు. కోహ్లీ ఫీల్డింగ్ కుర్రాళ్లకు ఆదర్శమని కొనియాడుతున్నాడు. అతన్ని చూసి నేర్చుకోవాలని కుర్రాళ్లకు హితవు పలుకుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్) రికార్డ్ సెంచరీతో చెలరేగగా.. రింకూ సింగ్(39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ తీసాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. అఫ్గాన్ టాప్-3 బ్యాటర్లు రెహ్మనుల్లా గుల్బాదిన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50), ఇబ్రహీమ్ జడ్రాన్(41 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50), గుల్బాదిన్ నైబ్(23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/18) మూడు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. తొలి సూపర్ ఓవర్‌లో అఫ్గాన్ 16 పరుగులు చేయగా.. భారత్ కూడా 16 పరుగులే చేసింది. రెండో సూపర్ ఓవర్‌లో భారత్ 11 పరుగులు చేయగా.. అఫ్గాన్1 పరుగే చేసి ఆలౌటైంది.

Story first published: Thursday, January 18, 2024, 7:16 [IST]
Other articles published on Jan 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+