IND vs AFG: స్పిన్నర్‌తో సూపర్ ఓవర్.. ఏం గుండెరా అయ్యా అది?
IND vs AFG:టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్‌తో పాటు అసాధారణ కెప్టెన్సీతో జట్టుకు విజయాన్ని అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కనీ వినీ ఎరుగని రీతిలో డబుల్ సూపర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ సంచలన బౌలింగ్‌తో టీమిండియా గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ(69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్) రికార్డ్ సెంచరీతో చెలరేగగా.. రింకూ సింగ్(39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. అఫ్గాన్ టాప్-3 బ్యాటర్లు రెహ్మనుల్లా గుల్బాదిన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50), ఇబ్రహీమ్ జడ్రాన్(41 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50), గుల్బాదిన్ నైబ్(23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
తొలి సూపర్ ఓవర్‌లో అఫ్గాన్ 16 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ అటాకింగ్ బ్యాటింగ్‌తో భారత్ కూడా 16 పరుగులే చేసింది. రెండో సూపర్ ఓవర్‌లోనూ రోహిత్ శర్మ 6, 4, 1తో బాది రనౌటవ్వడంతో 11 పరుగులే చేసింది. దాంతో భారత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. ఈ క్రమంలో రోహిత్ డేరింగ్ డిసిషన్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఆవేశ్ ఖాన్‌కు బదులు స్పిన్నర్ రవి బిష్ణోయ్‌తో రెండో సూపర్ ఓవర్ వేయించాడు. బిష్ణోయ్ సంచలన బౌలింగ్‌తో 11 పరుగులను డిఫెండ్ చేయడమే కాకుండా చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తొలి బంతికి రింకూ సింగ్ సాయంతో మహమ్మద్ నబీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. రెండో బంతికి సింగిల్ ఇచ్చిన అతను.. మూడో బంతికి గుర్బాజ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీలతో అఫ్గాన్ బ్యాటర్లను కట్టడి చేసినట్లు రవి బిష్ణోయ్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. అయితే రవి బిష్ణోయ్‌తో బౌలింగ్ చేయించడం రోహిత్ కెప్టెన్సీ గొప్పతనమని, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కొనియాడుతున్నారు. 'స్పిన్నర్‌తో సూపర్ ఓవర్.. ఏం గుండెరా అయ్యా అది?'అని ప్రశంసిస్తున్నారు.
సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తాతో పాటు ఆకాశ్ చోప్రా, సురేశ్ రైనాలు రోహిత్ నిర్ణయాన్ని కొనియాడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications