టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ డకౌటయ్యాడు. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో రనౌటై సిల్వర్ డక్‌గా వెనుదిరిగిన హిట్ మ్యాన్.. రెండో మ్యాచ్‌ల్లో క్లీన్ బౌల్డ్ అయ్యి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
ఫజలక్ ఫరూఖీ వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని ఫజలక్ ఫరూఖీ అక్రాస్ ది లైన్ వేయగా.. రోహిత్ శర్మ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ లోగా వెళ్లిన బంతి ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టింది. దాంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక అభిమానులు రోహిత్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ20 ఫార్మాట్‌లో ఆడటం రోహిత్ వల్ల కాదని, వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ తప్పుకుంటే శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి కుర్రాళ్లకు అవకాశం దక్కుతుందని, వారైనా అద్భుతంగా ఆడుతారని సూచిస్తున్నారు.
మరికొందరు రోహిత్ శర్మ వరుస గోల్డెన్ డక్స్‌పై ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. తొలి మ్యాచ్‌లో రోహిత్ నోరుపారేసుకున్న శుభ్‌మన్ గిల్ ఈ వీడియో చూసి తెగ సంతోషపడి ఉంటాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం Captain Rohit Sharma అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన రోహిత్ శర్మకు టీ20ల్లో ఎలా ఆడాలో తెలియడం లేదని కామెంట్ చేస్తున్నారు. హిట్ మ్యాన్ కాదని, డక్ మ్యాన్ అని ట్రోల్ చేస్తున్నారు.
క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి యశస్వి జైస్వాల్ ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదడంతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఐదు ఓవర్లలోనే భారత్ 60 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని నవీన్ ఉల్ హక్ విడదీసాడు. విరాట్ కోహ్లీ(29) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ఇబ్రహీమ్ జడ్రాన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/32) తీన్మార్ బౌలింగ్‌తో రఫ్ఫాడించగా.. రవి బిష్ణోయ్(2/39), అక్షర్ పటేల్(2/17) రెండేసి వికెట్లతో అఫ్గానిస్థాన్ పతనాన్ని శాసించారు. శివమ్ దూబేకు ఓ వికెట్ దక్కింది.