Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: బ్యాటింగ్ రాలేదని బౌలింగ్ ఇచ్చారు.. తొలిసారి బౌలింగ్ చేసిన కార్తీక్ కాక! (వీడియో)

IND vs AFG: Dinesh Karthik turns bowler for first time in his 18-year-old international career goes viral

హైదరాబాద్: గల్లీ క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ ఒక్కడే చేస్తున్నాడని సోపతిగాళ్ల మీద అలగడం.. ఏదైనా ఒకటే చేయాలని గొడవపడటం తరుచూ చూస్తుంటాం. బ్యాటింగ్ రాని ఆటగాళ్లకు ముందుగా బౌలింగ్ ఇచ్చి సంతృప్త పరచడం చేస్తుంటాం. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే తరహా సీన్ రిపీట్ అయింది. ఆసియాకప్ 2022 టోర్నీలో మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, నయా హిట్టర్ దినేశ్ కార్తీక్.. కేవలం ఒకే ఒక్క బంతి ఆడాడు.

ఒకే ఒక్క బంతి..

ఒకే ఒక్క బంతి..

అది కూడా పాకిస్థాన్‌తో ఉత్కంఠగా జరిగిన తొలి మ్యాచ్‌లో.. ఆ తర్వాత హార్దిక్ తనదైన శైలిలో ఆ మ్యాచ్‌ను గెలిపించాడు. అనంతరం హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్‌కు బ్యాటింగ్ రాకపోగా.. సూపర్ 4‌లో పాకిస్థాన్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లో అతనికి చోటు దక్కలేదు. ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా పరాజయం పాలవ్వడంతో కార్తీక్ విలువ ఏంటో తెలిసొచ్చింది. దాంతో అఫ్గాన్‌తో గురువారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌‌లో కార్తీక్ కాకకు టీమ్‌మేనేజ్‌మెంట్ మళ్లీ చాన్స్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లోనూ డీకేకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో చెలరేగడంతో పాటు కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించడంతో డీకే బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరమే లేకుండా పోయింది.

తొలిసారి బౌలింగ్..

దాంతో టోర్నీ మొత్తంలో డీకే కేవలం ఒకే ఒక్క బంతి ఆడాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్ అవకాశం రాని డీకేకు బౌలింగ్ ఇచ్చి సంతృప్త పరచాలని తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అనుకున్నట్లున్నాడు. అఫ్గాన్‌తో అప్పటికే భారత విజయం కూడా లాంఛనమవడంతో అతనికి ఆఖరి ఓవర్ వేసే అవకాశం ఇచ్చాడు. ఇక ఈ ఓవర్‌లో దినేశ్ కార్తీక్ 18 పరుగులు సమర్పించుకున్నాడు. పరుగులిచ్చుకున్నా.. 18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో అతను బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి కావడంతో చర్చనీయాంశమైంది. కార్తీక్‌ బౌలింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

4డీ ప్లేయర్...

4డీ ప్లేయర్...

ఈ వీడియోపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కార్తీక్ కాకకు కనీసం బౌలింగ్ అయిన దొరికిందని ఒక్కరంటే.. కెరీర్ చివరి దశలో ఉన్న కార్తీక్ కాక అనూహ్యంగా బౌలింగ్ చేయాలనే కోరికను కూడా తీర్చుకున్నాడని మరొకరు కామెంట్ చేశారు. కార్తీక్ కాక బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ కాదు.. బౌలర్ కూడా.. అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. కార్తీక్ 4డీ ప్లేయరని, ఫీల్డింగ్, కీపింగ్, బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా అన్ని పాత్రలు పోషించగలడని కొనియాడుతున్నారు.

కోహ్లీ అజేయ శతకం..

కోహ్లీ అజేయ శతకం..

సెంచరీ కోసం దాదాపు 1020 రోజుల నుంచి ఎదురు చూస్తున్న టీమిండియా బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ(61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 నాటౌట్) నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. తనకు మాత్రమే సాధ్యమైన ట్రేడ్ మార్క్ షాట్లతో ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేఎల్ రాహుల్(41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 62) అండగా నిలవడంతో పాటు బౌలింగ్‌లో భువనేశ్వర్(5/4) కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ కనబర్చడంతో అఫ్గాన్‌పై భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 222 పరుగులు చేసింది. అనంతరం అఫ్గాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

Story first published: Friday, September 9, 2022, 17:10 [IST]
Other articles published on Sep 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+