IND vs AFG: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్? గంభీర్ ఏమన్నాడంటే..?
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)2025 27 పాయింట్స్ టేబుల్‌లో భారత్ ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్.. భారత్ కంటే ముందున్నాయి. గత మూడు ఎడిషన్లలో భారత్ రెండు సార్లు ఫైనల్ చేరగా.. తృటిలో టైటిల్ చేజారింది.
తాజా సైకిల్‌లో టీమిండియా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. 9 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలతో ఫైనల్ చేరే అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. అద్భుతం జరిగితే తప్పా భారత్ ఫైనల్ చేరలేని పరిస్థితి నెలకొంది. కానీ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం తమ ఆటగాళ్ల ప్రతిభపై విశ్వాసం వ్యక్తం చేశాడు. జట్టు ఎదుర్కొన్న ఎదురుదెబ్బలను అధిగమించి ఫైనల్‌కు చేరే సత్తా తమకు ఉందని చెప్పాడు. అగ్రస్థానాన్ని అందుకోవడానికి తమ ఆటగాళ్ల సామర్థ్యం సరిపోతుందని అభిప్రాయపడ్డాడు.
4 ఓటములతో..
డబ్ల్యూటీసీ 25 27 సైకిల్‌ను భారత్ డ్రాతో ప్రారంభించింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2 2తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌ను 2 0తో ఓడించిన భారత్.. సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండు మ్యాచ్‌లకు రెండు ఓడి ఆరో స్థానానికి పడిపోయింది. భారత్ ప్రస్తుతం 48.15 విజయాల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్‌ను మీడియా ప్రతినిథులు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాల గురించి ప్రశ్నించారు. 'మేం ఆశావాదంతో ఉంటాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ కోసం మా సాయశక్తులా కృషి చేస్తాం. ఆ అవకాశం ఉన్నంత వరకు సానుకూల ధృక్పథంతో ముందుకు సాగుతాం.
ఫైనల్ చేరుతాం..
మా వద్ద ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. వారిపై మాకు అపార నమ్మకం ఉంది. మేం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ టైటిల్ గెలవలేమని అనుకోవడానికి ఎలాంటి కారణం లేదు. మా జట్టులోని ప్రతీ ఒక్కరు ఈ టైటిల్‌ను గెలవమనే నమ్మకంతో ఉన్నారు. ఒకటి, రెండు సిరీస్‌లు సరిగ్గా ఆడకపోవచ్చు. కానీ ఆటగాళ్లలో ఉన్న పట్టుదల, ప్రతిభ మాకు తెలుసు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఈ సైకిల్‌లో భారత్ ఇంకా 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. శ్రీలంకలో రెండు, న్యూజిలాండ్‌లో రెండు, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు ఆడాలి. ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ఈ 9 మ్యాచ్‌ల్లో ఏడు గెలవాలి. న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చివరిసారిగా 2009లో టెస్ట్ మ్యాచ్ గెలిచింది. అక్కడే జరిగే మ్యాచ్‌లు భారత జట్టుకు పెద్ద సవాల్‌గా మారనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

