Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Auqib Nabi: రంజీ కింగ్‌కు ఘోర అవమానం.. 60 వికెట్లు తీసినా..!

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ), సెలెక్టర్లు ఐపీఎల్‌కు తప్ప దేశవాళీ క్రికెట్‌కు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వరనే విషయం మరోసారి స్పష్టమైంది. రంజీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ‌కి మరోసారి ఘోర అవమానం ఎదురైంది.

సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ఈ జమ్మూ కశ్మీర్ పేసర్‌ను నెట్ బౌలర్‌గా ఎంపిక చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. 2025-26 రంజీ సీజన్‌లో ఆఖిబ్ నబీ 12.57 సగటుతో 60 వికెట్లు పడగొట్టి జమ్మూ కశ్మీర్‌కు టైటిల్ అందించినా.. సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు.

సర్వత్రా విమర్శలు..

ముందుగా అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టుకు ఆఖిబ్ నబీని ఎంపిక చేయలేదు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతడి స్థానంలో పంజాబ్‌కు చెందిన గుర్నూర్ బ్రార్‌కు అనూహ్యంగా అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సంజయ్ మంజ్రేకర్ అయితే రంజీ క్రికెట్‌లో ఇన్ని వికెట్లు తీసినా.. అవకాశం ఇవ్వనప్పుడు ఆ టోర్నీని మూసేయాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దిలీప్ వెంగ్ సర్కార్ కూడా మండిపడ్డాడు. సోషల్ మీడియా వేదికగా కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.

IND vs AFG BCCI Faces Backlash for Naming Domestic Star Auqib Nabi Only as a Net Bowler for Afghanistan Series

ఈ విమర్శలకు తలొగ్గిన సెలెక్టర్లు.. ఆకిబ్ నబీకి నెట్‌బౌలర్‌గా అవకాశం ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇది కంటి తుడుపు చర్య తప్ప, అతని ప్రతిభకు తగిన గుర్తింపు కాదని మండిపడుతున్నారు. ఆకిబ్ నబీని ఎంపిక చేయకపోవడంపై సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ఇచ్చిన వివరణ కూడా హాస్యాస్పదంగా మారింది.

నెట్ బౌలర్‌‌గా అవకాశం..

'ఆఖిబ్ నబీ అద్భుతమైన సీజన్‌ను ఆడాడు. అయితే.. భారత పిచ్‌లపై టెస్ట్ మ్యాచ్‌లకు ఎక్కువ ఫాస్ట్ బౌలర్లు అవసరం లేదు. అందుకే అతన్ని తీసుకోలేదు.’అని పేర్కొన్నాడు. మొత్తంగా 41 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నబీ 156 వికెట్లు పడగొట్టాడు. జూన్ 6న ప్రారంభమయ్యే ఈ టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు బరిలోకి దిగనుంది.

రంజీలో జమ్మూ కాశ్మీర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఒక ఆటగాడిని ప్రధాన జట్టులోకి తీసుకోకుండా కేవలం నెట్ ప్రాక్టీస్‌కు పరిమితం చేయడం అతని కృషిని అవమానించడమే అని విమర్శకులు దుయ్యబడుతున్నారు.

Story first published: Tuesday, June 2, 2026, 16:32 [IST]
Other articles published on Jun 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+