Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: భారత్‌తో టీ20 సిరీస్.. అఫ్గానిస్థాన్ జట్టు ఇదే!

మూడు టీ20ల సిరీస్ కోసం భారత పర్యటనకు రానున్న అఫ్గానిస్థాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ఏసీబీ ప్రకటించింది. 19 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ఆదివారం వెల్లడించింది. ఈ సిరీస్‌లో అఫ్గాన్ జట్టును ఇబ్రహీమ్ జడ్రాన్ సారథ్యం వహిస్తాడని అఫ్గాన్ బోర్డు తమ ప్రకటనలో పేర్కొంది.
రెగ్యూలర్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ జట్టుకు ఎంపికైనా అతను ఈ సిరీస్‌లో పాల్గొనడంపై సందేహాలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం అతను వెన్ను గాయం సర్జరీ నుంచి కోలుకుంటున్నాడని తెలిపింది.

'అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సెలెక్షన్ కమిటీ భారత పర్యటన కోసం 19 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. జనవరి 11 నుంచి ఇరు జట్ల మధ్య మోహాలీ వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అఫ్గానిస్థాన్ రెగ్యూలర్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఈ జట్టులో భాగంగా ఉన్నా.. అతను ఆడటంపై సందేహాలు ఉన్నాయి.

IND vs AFG: Afghanistan announce squad, India squad awaited

ప్రస్తుతం అతను వెన్ను గాయం శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్నాడు. అతని గైర్హాజరీలో యూఏఈ వేదికగా జరిగిన సిరీస్‌లో అఫ్గానిస్థాన్‌ను విజేతగా నిలిపిన ఇబ్రహీమ్ జడ్రాన్.. భారత్‌తో సిరీస్‌లో కెప్టెన్‌గా కొనసాగనున్నాడు'అని ఏసీబీ ప్రకటనలో పేర్కొంది.

అఫ్గానిస్థాన్‌ జట్టు:
ఇబ్రహీమ్ జడ్రాన్(కెప్టెన్), రషీద్ ఖాన్, గుర్బాజ్, హజాయ్, అలిఖిల్, రెహ్మాత్ షా, మహమ్మద్ నబీ, జడ్రాన్, జనత్, ఓమార్జాయ్, అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజలక్ ఫరూఖీ, మాలిక్, నవీన్ ఉల్ హక్, అహ్మద్, సలీమ్, అహ్మద్,నైబ్, రషీద్ ఖాన్

భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ షెడ్యూల్:

తొలి టీ20: జనవరి 11, రాత్రి 7 గంటలకు

రెండో టీ20: జనవరి 14, రాత్రి 7 గంటలకు

మూడో టీ20: జనవరి 17, రాత్రి 7 గంటలకు

Story first published: Saturday, January 6, 2024, 18:16 [IST]
Other articles published on Jan 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+