IND vs AFG: గాయంతో కోహ్లీ ఔట్.. ఆ ముగ్గురిలో ఒకరికి ఛాన్స్!
తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. కోహ్లీ గాయంపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఈ సిరీస్ ఆడటం కష్టమేనని బోర్డు వర్గాలు తెలిపాయి. జూన్ 13 నుంచి 20 మధ్య జరిగే ఈ మూడు వన్డేల సిరీస్‌తోనే వన్డే ప్రపంచకప్ 2027 సన్నాహకాలు ప్రారంభం కానున్నాయి.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగిన కోహ్లీ ఆర్‌సీబీని గెలిపించాడు. ఈ మ్యాచ్‌లోనే కోహ్లీ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. పరుగులు తీసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఫిజియో సైతం మైదానంలోకి వచ్చి సపర్యలు చేశాడు.
సాధారణ క్రాంప్స్ అని అంతా అనుకున్నారు. కానీ తొడ కండరాల గాయమని తర్వాత తేలింది. ఈ గాయాన్ని లెక్క చేయకుండా క్రీజులో నిలబడిన కోహ్లీ.. ఆర్‌సీబీకి రెండో కప్పును అందించాడు. ఒకవేళ అఫ్గాన్‌తో సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమైతే అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ముగ్గురు ఆటగాళ్లు పోటీపడనున్నారు.

1. సంజూ శాంసన్
వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజూ శాంసన్‌కు కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం దక్కవచ్చు. ఇప్పటికే టీ20ల్లో టీమిండియా తరఫున సంజూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. అంతేకాకుండా 2023లో సౌతాఫ్రికాపై అద్భుతమైన వన్డే సెంచరీ(114 బంతుల్లో 108) చేసినా తదుపరి మ్యాచ్‌లో అవకాశం దక్కలేదు. ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ సంజూ 14 ఇన్నింగ్స్‌ల్లో 477 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలతో పాటు ఒక హాఫ్ సెంచరీ ఉంది. టీ20 ప్రపంచకప్‌లోనూ సంజూ మెరుగైన ప్రదర్శన చేశాడు.
2. తిలక్ వర్మ
లెఫ్టార్మ్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మకు కూడా కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం దక్కవచ్చు. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగుతున్న తిలక్ వర్మ.. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో మెరుగైన రికార్డ్ లేకపోయినా.. కోహ్లీ తరహాలో ఒత్తిడిలో ఆడే సామర్థ్యం ఉండటం అతనికి కలిసొచ్చే అంశం. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లోనూ తిలక్ వర్మ సత్తా చాటాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 359 పరుగులు చేశాడు.
3. రజత్ పాటిదార్
ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ పేరును కూడా సెలెక్టర్లు పరిశీలించే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో వరుసగా ఆర్‌సీబీకి రెండు టైటిళ్లు అందించడంతో పాటు వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో పాటిదార్‌ను టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. అంతేకాకుండా మిడిలార్డర్‌లో ఆడే సత్తా రజత్ పాటిదార్‌కు ఉంది. ముఖ్యంగా స్పిన్నర్లను అతను సమర్థవంతంగా ఎదుర్కోగలడు. అఫ్గాన్ ప్రధాన బలమైన స్పిన్‌ను దెబ్బతీయాలంటే రజత్ పాటిదార్‌ను జట్టులోకి తీసుకోవాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో రజత్ పాటిదార్ 192.69 స్ట్రైక్‌రేట్‌తో 501 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో ఒంటి చేత్తో ఆర్‌సీబీని గెలిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications