Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India ODI Squad vs SA: తెలుగోడికి మళ్లీ అన్యాయమే.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడే భారత జట్టు ఇదే!

IND ODI Squad vs SA: Shikhar Dhawan To Lead In Rohit Sharmas Absence for ODI Series vs South Africa

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనున్న భారత ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ట్విటర్ వేదికగా వెల్లడించింది. అంతా ఊహించనట్లుగానే శిఖర్ ధావన్ ఈ జట్టును నడిపించనున్నాడు. ఇక సంజూ శాంసన్‌కు వైస్ కెప్టెన్సీ ఇస్తారని అంతా భావించినా.. సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్‌‌ను ధావన్ డిప్యూటిగా ఎంపిక చేశారు. యువ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్ అవకాశం దక్కించుకోగా.. ఇండియా ఏ తరఫున అదరగొట్టిన ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ రజత్ పటీదార్‌కు తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు.

షమీ తప్పా స్టాండ్ బై ఆటగాళ్లంతా..

రాహుల్ త్రిపాఠికి కూడా మరోసారి అవకాశం దక్కింది. వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌‌కు అవకాశం దక్కగా.. స్పిన్ ఆల్‌రౌండర్ల షాబాజ్ అహ్మద్, పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన ముకేశ్ కుమార్‌కు కూడా తొలిసారి టీమిండియా పిలుపు అందింది. ఇక వరల్డ్ కప్ టీమ్ స్టాండ్‌బైలో ఉన్న మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్‌లను కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. ఆసియాకప్‌లో దారుణంగా విఫలమైన ఆవేశ్ ఖాన్.. మళ్లీ జట్టులోకి వచ్చాడు.

తెలుగోడికి మళ్లీ అన్యాయమే..

తెలుగోడికి మళ్లీ అన్యాయమే..

న్యూజిలాండ్‌-ఏతో రాణించిన తెలుగు క్రికెటర్‌ తిలక్ వర్మకు మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. షమీని మినహా టీ20 ప్రపంచకప్ స్టాండ్ బైగా ఉన్న ఆటగాళ్లందరిని ఈ సిరీస్‌కు ఎంపిక చేయడం గమనార్హం. మెగా టోర్నీకి ముందు మ్యాచ్ ప్రాక్టీస్ లభించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మహమ్మద్ షమీ కూడా ఈ సిరీస్ ఆడుతారని భావించినా.. అతన్ని బుమ్రా స్థానంలో ఆసీస్‌కు పంపించి సన్నాహక మ్యాచ్‌లు ఆడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పండుగ తెల్లారే షురూ..

పండుగ తెల్లారే షురూ..

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ లక్నో వేదికగా దసరా పండుగ తెల్లారి(అక్టోబర్ 6) జరగనుంది. రెండో మ్యాచ్ రాంచీ వేదికగా అక్టోబర్ 9(ఆదివారం) జరగనుండగా.. ఆఖరి మ్యాచ్ ఢిల్లీ వేదికగా అక్టోబర్ 11న జరగనుంది. ఇక తిలక్ వర్మకు అవకాశం ఇవ్వకపోవడంపై తెలుగు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:

శిఖర్ ధావన్(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, షెహ్‌బాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

Story first published: Sunday, October 2, 2022, 19:23 [IST]
Other articles published on Oct 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+