సైనాకు చుక్కెదురు, సింధు, శ్రీకాంత్‌ల శుభారంభం

హైదరాబాద్: హాంకాంగ్ ఓపెన్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో చుక్కెదురైంది. ఈ హైదరాబాదీ ఏస్ ఆరంభంలోనే వెనుదిరిగి టోర్నీ నుంచి నిష్క్రమించింది. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో సైనా 21-10, 10-21, 19-21తో ప్రపంచ రెండోర్యాంకర్ అకానె యమగూచి (జపాన్) చేతిలో పోరాడి ఓడింది.

టోర్నీలో సింధు, శ్రీకాంత్ శుభారంభం
ఇక మరో స్టార్ షట్లర్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ టోర్నీలో శుభారంభం చేశారు. ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో సమీర్‌వర్మ హాంకాంగ్ ఓపెన్‌లో రెండోరౌండ్ చేరుకున్నారు. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో మూడోసీడ్ సింధు 21-15, 13-21, 21-17స్కోరుతో హోరాహోరీ పోరాటంలో థాయిలాండ్‌కు చెందిన నిచోన్ జిందాపోల్‌పై నెగ్గింది.

సింధుకు గంట సమయంలో తొలిరౌండ్
తొలిరౌండ్ అడ్డంకిని అధిగమించేందుకు సింధుకు గంట సమయం పట్టడం విశేషం. జిందాపోల్‌పై నాలుగోసారి విజయం సాధించిన సింధు.. టోర్నీలో ముందంజ వేసింది. సింధు 21-15, 13-21, 21-17తో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై అతికష్టమ్మీద గెలిచి రెండోరౌండ్ చేరింది.

రెండో రౌండ్లోకి హెచ్‌ఎస్ ప్రణయ్
మిగతా భారత షట్లర్లలో శ్రీకాంత్ 21-11, 21-15తో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై, సమీర్ వర్మ 21-17, 21-14తో సుపన్యు అవిహిగ్సానాన్ (థాయ్‌లాండ్)పై, హెచ్‌ఎస్ ప్రణయ్ 21-14, 13-21, 21-19తో ఆండ్రెస్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై గెలిచి రెండోరౌండ్లో ప్రవేశించారు. కాగా, పారుపల్లి కశ్యప్ 16-21, 3-21తో ఆంథోనీ సినిసుక (ఇండోనేసియా) చేతిలో, సాయి ప్రణీత్ 21-16, 11-21, 15-21తో ఖోసిత్ ఫెట్రాదాబ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడారు.

సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప జంటగా
పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో భారత్‌కు చెందిన సుమిత్ రెడ్డి-మను అత్రి జోడీ 21-12, 21-18తో బోదిన్-మనీపాంగ్ (థాయ్‌లాండ్) జంటపై నెగ్గగా.. సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం 19-21, 21-23తో మథియా్‌స-కార్స్‌టెన్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓడింది. ఇక, సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప జంట 21-18, 10-21, 8-21తో రెండోసీడ్ మిసాకి-తకహషి (జపాన్) చేతిలో ఓడడంతో మహిళల డబుల్స్‌లో భారత్ పోరు ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications