కేప్ టౌన్: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో వన్డేలో స్లో ఓవరేట్ బౌలింగ్ వేసినందుకు గాను దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. మరోవైపు కెప్టెన్ డుప్లెసెస్‌కు 20 శాతం, ఇతర క్రికెటర్లకు 10 శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఇక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ వ్యక్తిగత మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించారు. ఐసీసీ ప్రవర్తన నియమావళిని తాహిర్ ఉల్లంఘించాడని, ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఒక ప్రకటనలో ఐసీసీ పేర్కొంది.

రాబోయే 12 నెలల్లో దక్షిణాఫ్రికా మరోసారి స్లో ఓవరేట్‌తో బౌలింగ్ చేస్తే కెప్టెన్ డు ప్లెసిస్ సస్పెన్షన్ ఎదుర్కొవాల్సి ఉంటుందని ఐసీసీ పేర్కొంది. కెప్టెన్ డుప్లెసెస్‌తో పాటు తాహిర్ కూడా తాము చేసిన తప్పుని అంగీకరించి, జరిమానా చెల్లించేందుకు ముందుకొచ్చారు.
ఎవరు గొప్ప?: అశ్విన్‌పై అసూయతోనే భజ్జీ వ్యాఖ్యలుఇదిలా ఉంటే వన్డే క్రికెట్ చరిత్రలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంతవరకూ వైట్‌వాష్ ఎరుగని ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో వరుసగా ఐదు వన్డేల్లోనూ ఓడి 0-5తో క్లీన్‌స్వీప్ ఎదుర్కొంది. ఐదుసార్లు వన్డే చాంపియన్లుగా చెప్పుకునే జట్టు క్లీన్ స్వీప్‌కు గురవ్వడంతో అవమానభారంతో తలదించుకుంది.

స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టి, డుప్లెసిస్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు చేతిలో క్లీన్ స్వీప్‌కు గురవడం యావత ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన తొలి జట్టుగా దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది